Gorutla Madhav: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. లేటెస్ట్‌గా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు స్వయంగా కంప్లైంట్ చేశారు. అసలేం జరిగింది?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ ఉంటారో తెలీదు. వైసీపీలో చాలాకాలం పని చేశారు వాసిరెడ్డి పద్మ. జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవిని చేపట్టారామె. గత ఎన్నికల ముందే ఆ పార్టీకి దూరమయ్యారు. రీసెంట్‌గా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారామె. తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానో ఓపెన్‌గా చెప్పేవారు.
వైసీపీ నేత గోరంట్ల మాధవ్ గురించి చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మాజీ ఎంపీ కూడా. స్వతహాగా ఆయన పోలీసు అధికారి. గత టీడీపీ సర్కార్ హయాంలో జేసీ దివాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి హాట్ టాపిక్ అయ్యారు. దీంతో ఆయనకు మాంచి ఇమేజ్ ఇచ్చింది.
దాన్ని వైసీపీ వినియోగించుకుని ఎంపీ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగిపోయింది. ప్రస్తుతానికి ఆయన మాజీ ఎంపీ. ఒకప్పుడు వాసిరెడ్డి పద్మ- గోరంట్ల మాధవ్ ఇద్దరూ వైసీపీలో ఉండేవారు.
ALSO READ: ఎంత మందిని తొక్కినార తీస్తావు పవన్.. చిన్నపిల్లను రేప్ చేస్తే కూడా.. రోజా ఎమోనల్
అత్యాచార బాధితుల విషయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్యకరంగా మాట్లాడారన్నది వాసిరెడ్డి పద్మ వెర్షన్. ఆయనపై వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారామె. విజయవాడ వచ్చి పోలీసు కమిషన్‌కు వివరించడం, ఆపై ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయింది.
ముఖ్యంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం అన్యాయమని, మాజీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, తన రాజకీయ నిర్ణయాన్ని మరో వారంలో వెల్లడిస్తానని చెప్పకనే చెప్పేశారు. దీంతో వాసిరెడ్డి రూటు ఎటువైపు అంటూ చర్చించుకోవడం నేతల వంతైంది.