EPAPER

Long Hair Tips: వారానికి 2 సార్లు ఈ ఆయిల్స్ రాస్తే.. వద్దన్నా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది తెలుసా ?

Long Hair Tips: వారానికి 2 సార్లు ఈ ఆయిల్స్ రాస్తే..  వద్దన్నా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది తెలుసా ?

Long Hair Tips: కాలుష్యం, చెడు జీవనశైలి కారణంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభం అవుతుంది. అందుకే జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. బయట మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడకుండా ఉండటం మంచిది. వీటితో జుట్టు రాలడం ఎక్కువవుతుంది. అందుకే నేచురల్‌గా ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన గానుగ నూనెలను వాడటం మంచిది.


ఇదిలా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తరుచుగా జుట్టుకు నూనె రాయాలి. కొన్ని రకాల నూనెలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి వాటిని బలంగా మారుస్తాయి. మరి ఏ నేచురల్ హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల జుట్టుకు మేలు జరుగుతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో జుట్టు రాలడం, నెమ్మదిగా పెరగడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. కాలుష్యం, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, జుట్టు సంరక్షణ తీసుకోకపోవడం వంటి అంశాలు జుట్టును దెబ్బతీస్తాయి.జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చడంలో సహాయపడే అనేక లక్షణాలను నేచురల్ ఆయిల్స్ కలిగి ఉన్నాయి.


1. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు అత్యంత ప్రాచుర్యం పొందిన, ప్రయోజనకరమైన నూనెలలో ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, లారిక్ యాసిడ్ జుట్టుకు తేమను అందించి బలపరుస్తుంది.

కొబ్బరి నూనె యొక్క ప్రయోజనాలు:
1. జుట్టుకు తేమను అందిస్తుంది.
2. చుండ్రును తగ్గిస్తుంది.
3.జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
4. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

జుట్టుకు ఎలా ఉపయోగించాలి ?
కొబ్బరి నూనెను వేడి చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.

2. బాదం నూనె:

బాదం నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టుకు పోషణను అందిచడమే కాకుండా బలపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా చుండ్రుతో పోరాడటానికి సహాయపడుతుంది.

బాదం నూనె యొక్క ప్రయోజనాలు:
1. జుట్టుకు పోషణనిస్తుంది
2. జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది
3. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
4. చుండ్రుతో పోరాడటానికి సహాయపడుతుంది

జుట్టుకు ఎలా ఉపయోగించాలి ?
బాదం నూనెను వేడి చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు దీనిన రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.

3.ఆముదం:
ఆముదం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో ఉండే రిసినోలిక్ యాసిడ్ వెంట్రుకల కుదుళ్లను బలపరిచి, జుట్టును ఒత్తుగా మారుస్తుంది.

Also Read: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు

ఆముదం యొక్క ప్రయోజనాలు
1.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
2.జుట్టును చిక్కగా చేస్తుంది
3.జుట్టును మెరిసేలా చేస్తుంది
4. చుండ్రును తగ్గిస్తుంది

ఎలా ఉపయోగించాలి ?
కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటి ఇతర నూనెలతో కలపడం ద్వారా ఆముదం నూనెను ఉపయోగించండి. దీన్ని జుట్టు కు పట్టించి రాత్రంతా అలాగే ఉంచండి.
ఉదయం షాంపూతో వాష్ చేసుకోండి. వారానికి ఒకసారి ఇలా చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Big Stories

×