Winter Skin Care Tips: చలికాలం స్టార్ట్ అయింది. ఈ సీజన్‌లో అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. చర్మం పొడిబారిపోవడం వంటివి సమస్యలు తలెత్తుతాయి. స్నానం చేసిన తర్వాత మీ చర్మాన్ని చూసుకున్నారంటే తెల్లగా మారి.. దురద పెడుతుంటుంది. దీనికి కారణం గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. చలికాలంలో వచ్చే చల్లటి గాలుల నుంచి చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల ఫలితం వస్తుందో రాదో తెలీదు. పైగా చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువ ఖర్చుతో నేచురల్‌గా మన ఇంట్లోనే దొరికే పదార్ధాలతో ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి మంచి రిజల్ట్ కనిపిస్తాయి.
కలబంద, తేనె ఫేస్ ప్యాక్
కలబందలో యాంటీ ఆక్సీడెంట్లు , విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తాయి. అంతే కాదు కలబందలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
రోజ్ వాటర్, గ్లిజరిన్ ఫేస్ ఫ్యాక్..
రోజ్ వాటర్ చర్మానికి తాజాదనాన్ని, అలాగే చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. గ్లిజరిన్ చర్మానికి తేమను అందిస్తుంది. గ్లిజరిన్‌లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో ఫేస్‌ని శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతి రోజు చేస్తే.. ముఖంపై మురికి తొలగిపోయి.. మృదువుగా, కాంతివంతంగా మెరుస్తుంది.
కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె ముఖానికి మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ముఖానికి సహజమైన మెరుపును అందిస్తుంది. కాబట్టి ప్రతిరోజు స్నానానికి ముందు ఐదు నిమిషాల పాటు కొబ్బరినూనెతో మసాజ్ చేసి.. ఆ తర్వాత స్నానం చెయ్యండి. ఇది చలికాలంలో బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
Also Read: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు
తేనె, నిమ్మరసం ఫేస్ ప్యాక్..
తేనె చర్మానికి తేమను అందించడంలో అధ్బుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి మెరుపును అందిస్తుంది. తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.
ఆరెంజ్ పీల్ ఫౌడర్, పాలు ఫేస్ ప్యాక్
ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి ఉంటుంది. ఇవి చర్మాన్ని టోన్‌గా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. పాలు చర్మానికి తగిన పోషకాలు అందించడంతో పాటు, ముఖంపై మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్‌లో మూడు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.
మాయిశ్చరైజర్..
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయడం చాలా అవసరం. ఇది శరీరానికి తేమను అందిస్తుంది. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్న.. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేయడం మర్చిపోవద్దు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.