Regina On Bollywood: ఇండస్ట్రీ ఏదైనా సరే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవాలని సెలబ్రిటీలు ఎంతో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్ లో నటిస్తే టాలీవుడ్ కే పరిమితం, అదే కోలీవుడ్ అయితే కోలీవుడ్ ఆడియన్స్ కి మాత్రమే తెలుస్తుంది. కానీ బాలీవుడ్ లో సినిమాలు చేశారంటే పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు లభిస్తుంది. దీనికి తోడు పరపతి పెరుగుతుంది. రెమ్యునరేషన్ అధికమవుతుంది. ఇలా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చాలామంది సెలబ్రిటీలు బాలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ లో పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.
బాలీవుడ్లో క్రేజ్ కోసం పరితపిస్తున్న సౌత్ సెలబ్రిటీస్..
ఇప్పటికే సమంత (Samantha), నయనతార (Nayanatara), ఇలియానా(Ileana), రష్మిక మందన్న(Rashmika mandanna) ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో అవకాశాల కోసం పరితపిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు రిలీజ్ అవుతున్నా బాలీవుడ్ ఇమేజ్ మాత్రం వేరనే చెప్పాలి. అయితే ఆ ఇమేజ్ సొంతం చేసుకోవాలని సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్తున్న ఇతర భాషా అమ్మాయిలకు అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముంబైలో సెటిల్ అవ్వాలని అనుకున్న ఎందరో తారలు మధ్యలోనే మూట ముల్లె సర్దుకొని సొంత ఊర్లకు వచ్చేస్తున్నారు. అక్కడి వాతావరణం సెట్ కాకపోవడం ఒక ఎత్తైతే, లోన్లీ ఫీలింగ్ ,దీనికి తోడు మరెన్నో కారణాలు.. అయితే ఇలాంటివన్నీంటిని ఎదుర్కొన్న వారిలో తాను కూడా ఒకరిని అంటూ చెప్పుకొచ్చింది ప్రముఖ సీనియర్ హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra).
రెజీనా కసాండ్రా సినిమాలు..
శివ మనసులో శృతి అనే సినిమాతో కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ అందుకుంది. అందం, అభినయం ఉన్నా ఎందుకో ఈమెకు మాత్రం ఇండస్ట్రీలో కలిసి రావడం లేదు. దీనికి గల కారణం కూడా అంతు చిక్కడం లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టిన ఈమె ఇంకా సరైన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది.సక్సెస్ దిశగా అడుగులు వేయాలనే క్రమంలో పిల్ల నువ్వు లేని జీవితం , రారా కృష్ణయ్య, పవర్ వంటి సినిమాలతో పాటు షాకిని డాకిని, ఫింగర్ టిప్స్, ఆన్యా ట్యుటోరియల్ , శూర్ వీర్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. చివరికి ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది. ఇటీవల కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నటించిన ఆచార్య (Acharya) సినిమాలో ఏకంగా మెగాస్టార్ పక్కన కూడా ఐటమ్ సాంగ్ లో మెరిసింది. అయితే ఎవరు.. ఏవీ.. కూడా ఈమెకు గుర్తింపును అందివ్వలేదు.
బాలీవుడ్ లో సౌత్ అమ్మాయిలకు దారుణమైన కష్టాలు..
ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్న ఈమె, బాలీవుడ్లో జాట్ , సెక్షన్ 108 వంటి సినిమాలలో కూడా నటిస్తోంది. ఈ జాట్ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా వుండగా తాజాగా ఒక ఆంగ్లం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ..”దక్షిణాది నుంచి వెళ్లే అమ్మాయిలకు భాష రాకపోతే హిందీలో అవకాశాలు రావు. ఒకవేళ అవకాశం వచ్చినా ముంబైలోనే అందుబాటులో ఉండాలని , మీటింగ్స్ కి రావాలి అని, రకరకాల కండిషన్స్ కూడా పెడతారు. అయితే సౌత్ లో మాత్రం ఇలా ఉండదు”. అంటూ సౌత్ హీరోయిన్స్ కి బాలీవుడ్ లో ఎదురయ్యే కష్టాల గురించి చెప్పుకొచ్చింది రెజీనా.