Millionaire Husband Rules: పెళ్లి విషయంలో చాలా దేశాల్లో వేర్వేరు నియమాలుంటాయి. అమెరికాలో భార్యభర్తలు వివాహానికి ముందే ఆస్తి విషయంలో కాంట్రాక్టు రాసుకుంటారు. విడాకులు తీసుకుంటే ఆస్తిపై దావా వేయకూడదని లేకపోతే విడాకులు తరువాత కొంతవరకు మాత్రమే ఆస్తి వస్తుందని. కానీ గల్ఫ్ దేశాల్లో అయితే ఈ నియమాలు మరింత కఠినంగా ఉంటాయి. భార్యలు పర పరుషులతో మాట్లాడకూడదు. వారితో స్నేహం చేయకూడదు.ఇలాంటి షరతులే ఒక సంపన్న కుటుంబానికి చెందిన ఓ యువకుడు తన భార్యకు విధించాడు.
అయితే ఆ నియమాలన్నీ ఆమె అంగీకిరించింది. దేని కోసం అనుకుంటున్నారు.. ఇంకేముంది అతని డబ్బు కోసం. లండన్ లో చదువుకున్న ఆ యువతి సోషల్ మీడియాలో తన భర్త పెట్టిన కఠిన రూల్స్ ని వివరిస్తూ పోస్ట్ చేసింది. ఇప్పుడా పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఆమె పోస్ట వల్ల నెటిజెన్లు మధ్య వాగ్వాదమే జరుగుతోంది. కొందరు ఆమె భర్త న్యాయ సమ్మతంగా షరతులు విధించాడంటే.. మరికొందరు డబ్బు కోసం ఆమె తన స్వేచ్ఛను కోల్పోయిందని విమర్శిస్తున్నారు.
Also Read: ‘లైఫ్ జాకెట్ వేసుకుంటే సెల్ఫీ చెడిపోతుంది’.. సముద్రంలో మునిగిపోయిన ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్లు
వివరాల్లోకి వెళితే.. దుబాయ్ లో నివసించే సౌదీ అల్ నడక్ అనే యువతి ఎప్పుడూ సోషల్ మీడియాలో తన వ్యక్తిగత వీడియోలు పోస్ట చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన భర్త గురించి చెబుతూ.. అతను పెళ్లికి ముందు తనకు విధించిన షరతులను ప్రస్తావించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్‌కు 3.5 మిలియన్ వ్యూస్, 52000 లైక్స్ వచ్చాయి.
ఆ పోస్ట్ లో ఆమె ముందుగా తన విలాసవంతమైన జీవితం గురించి రాసింది. తన భర్త తాను ఏది కోరితే అది తెచ్చిస్తాడని, తన కోసం మ్యాచింగ్ డ్రెస్ బ్యాగ్స్, షూస్ అన్నీ సమకూరుస్తాడని తెలిపింది. ఈ పోస్ట్ ప్రకారం.. 26 ఏళ్ల సౌదీ అల్ నడక్ ప్రతిరోజు మంచి నైపుణ్యం ఉన్న బ్యూటీషియన్ వద్ద హెయిర్ స్టైల్, మేకప్ చేయించుకుంటోంది. తన భర్త తనను ఒక రాజకుమారి లా చూసుకుంటున్నాడని చెప్పింది. ప్రతి రోజు బయట రెస్టారెంట్ లోనే ఇద్దరూ కలిసి భోజనం చేస్తారట. తరుచూ విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణాలు చేస్తూ విదేశాలు తిరుగుతుంటారట, ఖరీదైన కార్లలో షాపింగ్ కు వెళ్తారట.
కానీ తనకు అప్పుడప్పుడూ బోర్ కొడుతుంటే.. ఆమె ఉద్యోగం చేయాలని భావించింది.. అందుకు మాత్రం భర్త అంగీకరించలేదట. ఎందుకంటే పెళ్లికి ఆమె భర్త ఈ షరతులు విధించాడు. భార్యకు పర పురుషులతో స్నేహం ఉండకూడదు. భర్త కూడా మహిళలతో స్నేహం చేయడు. ఇద్దరి ఫోన్లలో ట్రాకింగ్ యాక్టివేట్ అయి ఉంటుంది. దీంతో ఒకరు ఎక్కడ ఉన్నా మరొకరికి సమాచారం ఉండాలి. ఇలాంటి షరతులు ఇంకా ఉన్నాయి.
అయితే ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ చదివిన నెటిజెన్లు తీవ్రంగా డిబేట్ చేసుకుంటున్నారు. ఆమె పోస్ట వైరల్ కావడంతో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. ఆమె వీడియో చూసిన ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “ఎంత డబ్బు ఉన్నా.. సంతోషాన్ని మాత్రం కొనలేం. నీ భర్త నిన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలుస్తోందా? అతనికి నీపై నమ్మకం లేదు. నువ్వు ఒక పరిపూర్ణమైన జీవితం అనుభవించడం అతనికి ఇష్టం లేదు.” అని రాశాడు.
మరొక యూజర్ అయితే.. “ఆమె భర్త కూడా మహిళలతో స్నేహం చేయడం లేదు కదా.. వారిద్దరూ అందుకు అంగీకరించినట్లే. అయినా ఆమెకు అంత విలాసవంతమైన జీవితం ఇచ్చాడు. ఆమె కూడా అందులో సంతోషంగా ఉంది. మరి ఆమె భర్త పెట్టిన కండీషన్స్ తప్పేమి కాదు” అని రాశాడు.
దీనికి ఇంకొక యూజర్ కౌంటర్ కామెంట్ చేశాడు.. “అతను ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నీ ముఖంలో నవ్వు లేకపోతే వేస్ట్. అతను నీ నవ్వుని మాత్రం కొనలేకపోతున్నాడే. నీకు సొంతంగా అభిప్రాయాలు ఉండడం అతనికి ఇష్టం లేదేమో. నీ లైఫ్ చాలా బోరింగ్.. నీపై మోజు తగ్గాక నీకు విడాకులు ఇచ్చేస్తే.. నీ పరిస్థితేంటి? ” అని ప్రశ్నించాడు.
నిజానికి సౌదీ అల్ నడక్ లండన్ లో పుట్టి పెరిగింది. ఆమె అక్కడే కాలేజీలో చదువుకుంటుండగా.. అదే కాలేజీ ఆమె భర్త కూడా చదువుకున్నాడు. 8 ఏళ్ల క్రితం కాలేజీలో వారిద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే ఆమెను అతడు పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. కానీ పెళ్లి చేసుకున్నాక దుబాయ్ లో తనతో జీవితం గడపాలని మొదటి కండీషన్ పెట్టాడు. మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. పురుషులు రెండో వివాహం చేసుకోవచ్చు. కానీ అందుకు మొదటి భార్య అంగీకారం అవసరం.