EPAPER

Nara Lokesh: వైసీపీలో లోకేష్ టెన్షన్.. జైలుకి వెళ్లేది వీళ్లేనా?

Nara Lokesh: వైసీపీలో లోకేష్ టెన్షన్.. జైలుకి వెళ్లేది వీళ్లేనా?

Nara Lokesh: రెడ్‌బుక్‌.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన టాపిక్‌. ఎన్నికలకు ముందే నారా లోకేష్‌ దీనిపై హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం వస్తే.. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది వైసీపీ నేతలతో పాటు అధికారులూ.. వివిధ కేసుల్లో ఇరుకున్నారు. రెడ్‌బుక్‌లో పేర్లు ఉండటం సహా.. వారు చేసిన తప్పుల నేపథ్యంలో వివిధ కేసుల్లో ఇరుకున్నారనే వాదనలు ఉన్నాయి. తాజాగా చాప్టర్-3 పేరుతో లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో గుబులురేగుతోందనేది పొలిటికల్ వర్గాల్లో టాక్‌. అసలు రెడ్‌బుక్ ఏమిటి.. దానిలో పేర్లు ఉన్న వారి పరిస్థితి ఏంటి? వాచ్ దిస్‌ స్టోరీ.


రెడ్ బుక్ చాప్టప్-3 పై హింట్ ఇచ్చిన నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ చేసిన కామెంట్స్‌ చూస్తే.. త్వరలోనే రెడ్‌బుక్‌ చాఫ్టర్‌-3 ప్రారంభమవుతుందని హింట్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామన్న లోకేష్‌.. త్వరలోనే రెడ్‌బుక్‌ మూడో చాప్టర్‌ తెరుస్తున్నట్లు వెల్లడించారు. యువగళం పాదయాత్రలో తనను.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని.. అలాంటి వారి పేర్లు మాత్రమే రెడ్‌బుక్‌లో ఉన్నట్లు లోకేష్ తెలిపారు. తాను గుడ్‌బుక్ తీసుకొస్తానంటున్న జగన్‌కు.. ఆసలు బుక్‌లో ఏం రాయాలో కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు.


చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామని వ్యాఖ్య

లోకేష్ వ్యాఖ్యలు విన్న తర్వాత తెలుగుతమ్ముళ్లలో కాస్త జోష్‌ పెరిగిందట. అప్పుడే రెడ్‌బుక్‌లోని రెండు చాఫ్టర్లు అయిపోయాయా అని చర్చించుకుంటున్నారట. చాఫ్టర్‌-3 ప్రారంభిస్తామని వేదికపై ప్రకటించటంతో అందులో ఎవరెవరు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో లోకేష్‌ పాదయాత్ర చేశారు. ఆయనకు చాలా చోట్లా ఇబ్బందులు ఎదురయ్యాయట. కొన్ని చోట్ల నేతలతో.. మరికొన్ని చోట్ల అధికారుల తీరులో నాడు లోకేష్ ఇబ్బంది పడ్డారట. అందుకే ఎన్నికల సమయంలోనే రెడ్‌బుక్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, నేతలతో పాటు.. మరికొందరి పేర్లు ఉన్నాయని.. ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. నాడు రెడ్‌బుక్ అనే పేరు చెప్పిన తర్వాత వైసీపీ నేతలు.. లోకేష్‌పై సెటైర్లు వేశారట. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని.. రెడ్‌బుక్‌ అనేది వట్టిమాటలేనని కామెంట్స్ కూడా చేశారట.

ఎన్నికల సమయంలో రెడ్ బుక్ అంశంపై ప్రస్తావన

గత ఎన్నికల్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక.. చాలా మార్పు చేర్పులు జరిగాయట. గత ప్రభుత్వ హయాంలో అన్నీ తామై వ్యవహరించిన అధికారులపైనా వేటు కూడా పడింది. వైసీపీ సర్కారు మారాక కొందరు స్వచ్ఛంద విరమణ కూడా తీసుకున్నారట. మరికొందరైతే ఇచ్చిన పని చేసుకుంటూ.. ఎప్పుడేమి జరుగుతుందోననే భయంలో ఉన్నారట. వైసీపీ హయాంలో నోరు పారేసుకుని.. ఇష్టారాజ్యంగా చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారులో కొందరు ఇప్పటికే కేసుల్లో ఇరుకున్నారు. అంటే.. లోకేష్ ప్రకటించిన విధంగానే కొందరు నేతలు కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారట. త్వరలోనే చాఫ్టర్ -3 అనే ప్రకటనతో ఫ్యాన్‌ పార్టీ నేతల్లో భయాందోళన నెలకొందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Also Read: నెల్లమర్లలో టెన్షన్.. టీడీపీ వర్సెస్ జనసేన

నటి జెత్వానీ కేసులోనూ సజ్జలే కీలకమని వాదనలు

కూటమి అధికారంలోకి వచ్చాక కేసులో పలువురు నేతలతో పాటు అధికారులూ కూడా వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోవటమే కాకుండా.. కోర్టులు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అలాంటి వారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయంలో సకలశాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల.. కొన్ని కేసుల్లో వేలు పెట్టారని.. అదే కారణంగా నేడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే టాక్ నడుస్తోంది. టీడీపీ కేంద్ర కార్యాయలం దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరూ ఉందట. ప్రస్తుతం ఆయన విచారణకు హాజరవుతున్నారు. దీంతో పాటు నటి జెత్వానీ కేసులోనూ రామకృష్ణారెడ్డే.. కీలకమనే ఆరోపణలూ వచ్చాయి. ఏకంగా తనను కొన్నిరోజుల పాటు గృహనిర్బంధం చేశారంటూ జెత్వానీ ఆరోపించారు. సజ్జల ప్రోత్సాహంతోనే కొందరు పోలీసులు ఉన్నతాధికారులు తనను ఇబ్బంది పెట్టారని ఆమె ప్రెస్‌మీట్‌లో చెప్పారు. దీంతో ఆ కేసులోనూ సజ్జల విచారణ ఎదుర్కొంటున్నారు.

అదే కేసులో ఇరుక్కున్న ఆంజనేయిలు, కాంతీరాణా టాటా

ఇదే కేసులో ముగ్గురు సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు జెత్వానీ చేసిన ఆరోపణలపై.. PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీను కేసులో నిందితులుగా చేర్చారట. ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చెప్పిన ప్రకారం.. ఈ ముగ్గురు అధికారులూ ఇరుకున్నారట. గత ప్రభుత్వ హయాంలో నాటి పెద్దల ఆదేశాలతోనే వీరు.. జెత్వానీ అంశంలో కలుగుచేసుకున్నారని.. ఉన్న ఉద్యోగం చేసుకోక.. లేనిపోని వివాదాల్లో వేలు పెడితే.. ఫలితం ఇలాగే ఉంటుందనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వాలు మారటం సహజమని.. అలాగని నేతలకు తొత్తులుగా మారితే.. ఇలాంటి పరిణామాలు తప్పవని రాజకీయ విశ్లేషకులూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట.

గుంటూరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంపై వైసీపీ కీలకనేతలపై కేసులు నమోదయ్యారు. గత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి జోగి రమేష్‌, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌కూడా కేసులో ఉన్నారట. మరోవైపు.. జోగి రమేష్ తనయుడుపై మరో కేసు కూడా నమోదైంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు అంశంలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి… ప్రభుత్వ ఆధీనంలోని భూములను కొనుగోలు చేశారంటూ అతనిపై కేసు నమోదు అయ్యింది. టీడీపీ సెంట్రల్ ఆఫీసు ధ్వంసం కేసులో మాత్రం… సజ్జల, జోగి,అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ సహా పలువురు నేతలపై కేసులు నమోదుకావటంతో.. వారంతా విచారణకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు అంశంలో జోగి కుమారుడిపై కేసు

చంద్రబాబు, లోకేష్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్‌ పైనే కేసులు నమోదయ్యాయి. అతను వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. టీడీపీ అధినేతతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ను కూడా తీవ్ర పదజాలంతో దూషించిన అంశంపై కేసు నమోదు అయ్యిందట. అనిల్ ప్రవర్తన, మాట తీరుపై అప్పట్లో చాలామందీ ఆగ్రహం వ్యక్తం చేశారట. అతని భాష, మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌తో.. చంద్రబాబు కుటుంబంపై అనిల్‌.. తీవ్ర విమర్శలు చేశారు. తీరా అరెస్టు అయిన తర్వాత.. వైపీసీ నుంచి కనీస రెస్పాన్స్ రాకపోవటంతో అనిల్‌ బోరుమంటున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పొలిటికల్ వర్గాల టాక్‌.

Also Read: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్ పై కేసులు

అధికారం కోల్పోయిన తర్వాత కేసులు ఎదుర్కొన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ పరిస్థితీ అంతే. మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌పై.. గతేడాది దాడికి సంబంధించి నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదే కేసులో బోరుగడ్డ అనిల్‌ పేరు కూడా చేర్చారట. ఇందులో ఏ1గా నందిగం సురేశ్‌ ఉండగా.. ఏ2గా బోరుగడ్డ అనిల్‌ పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అనిల్‌పై మరో కేసు కూడా నమోదైంది. మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ ప్రధాన నిందితుడిగా ఉన్నారట. దీంతో గత ప్రభుత్వ హయాంలో అంతా తానై అంటూ వ్యవహరించిన నేతలంతా కొన్ని తప్పులు చేశారని.. దాని పర్యవసానమే ఈ కేసులని జనాల్లో చర్చ సాగుతోందట. ఆబ్కారీ వ్యవహరంలో వాసుదేవరెడ్డి, మైనింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి కూడా ఆయా శాఖల్లో జరిగిన అవినీతి అంశంపై కేసులు ఎదుర్కొంటున్నారట. అధికారం శాశ్వతం అన్నట్లుగా వీరంతా వ్యవహరించారని.. ప్రభుత్వం మారటంతో ఇరకాటంలో పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి.

మైనింగ్ కేసులో బుక్ అయిన వెంకట్రామిరెడ్డి

ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. రెడ్‌బుక్‌లో మరో ఇద్దరి పేర్లు ఉన్నాయనే వాదనలు గుప్పుమంటున్నాయి. ఇందులో మాజీమంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబంపై తీవ్రపదజాలంతో ఆరోపణలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటూ టీడీపీ అధినేతను కంటతడి పెట్టేలా చేశారు. ప్రస్తుతం వీరిపై చిన్నచిన్న కేసులు ఉన్నా.. మూడో చాఫ్టర్‌లో వీరే ఉండబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. విదేశాల్లో వీరి ఇద్దరిపై పోటీ చేసి గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము సమక్షంలోనే లోకేష్‌.. రెడ్‌బుక్‌ చాఫ్టర్ త్రీ గురించి ప్రస్తావించారు. వీరు ఓకే అంటే.. మరికొందరి భరతం పడతామని మంత్రి అన్నారు. కాబట్టి.. వీరు పేర్లు ప్రస్తావించారంటే నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని, వల్లభనేని వంశీయే అయ్యింటారనే టాక్ నడుస్తోంది.

మరోవైపు.. నారా లోకేష్ చాఫ్టర్ -3 అంశంపై పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. నిజంగానే మరికొందరి భరతం పడతారా లేక పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచేందుకు లోకేష్ అలా అన్నారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. తమకు తెలియకుండానే చాఫ్టర్‌-1, 2 అయిపోయాయా అని మరికొందరు తెలుగుదేశం శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

Related News

US Presidential Elections 2024: సర్వేల్లో తేలిందేంటి? గెలుపు ఎవర్ని వరించబోతుంది?

Caste Census: దేశవ్యాప్తంగా ఎంత మంది బీసీలు ఉన్నారు.. లెక్కలు నష్టమా? లాభమా?

Chandrababu Naidu: చంద్రబాబు సీరియస్.. ఆ మంత్రి పోస్ట్ ఊస్టేనా..?

YS Jagan: ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. వ్యూహం ఫలిస్తుందా..?

Rushikonda Palace: జగన్‌కు బిగ్ షాక్.. రుషికొండ ప్యాలెస్ వాళ్లకే?

Nominated Posts In Telangana: కాంగ్రెస్‌లో పదవుల కోట్లాట.. రేవంత్ చెక్ పెడతారా?

Kotamreddy Sridhar Reddy: వైసీపీ పై కోటంరెడ్డి స్కెచ్.. అనిల్ కుమార్ యాదవ్ తట్టుకోగలడా?

Big Stories

×