EPAPER

Janwada Case : డ్రగ్స్ కేసు.. అనుమానితులపై ప్రశ్నల వర్షం.. తీగ లాగితే డొంక కదిలేనా.?

Janwada Case : డ్రగ్స్ కేసు.. అనుమానితులపై ప్రశ్నల వర్షం.. తీగ లాగితే డొంక కదిలేనా.?

Janwada Case :


⦿ జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసు
⦿ రంగారెడ్డి ఎక్సైజ్ పీఎస్‌కు రాజ్ పాకాల
⦿ న్యాయవాదితో కలిసి హాజరు
⦿ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో విచారణ
⦿ రాజ్ పాకాలతోపాటు విజయ్ మద్దూరిపై ప్రశ్నల వర్షం
⦿ ఓరియన్ విల్లాస్ నాగేశ్వర్ రెడ్డిని కూడా విచారించిన పోలీసులు

హైదరాబాద్, స్వేచ్ఛ: జాన్వడ ఫాంహౌస్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. మద్యం, డ్రగ్స్ కోణాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్ పాకాల, విజయ్ మద్దూరిని శుక్రవారం విచారణకు పిలిచారు. పార్టీలో విదేశీ మద్యం వాడకం, డ్రగ్స్ లింకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటికే వీరిద్దరినీ మోకిల పీఎస్‌లో విచారించారు.


ఫాంహౌస్ పార్టీ కేసు

జన్వాడలోని రాజ్ పాకాల ఫాంహౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న పార్టీపై పోలీసులు కొద్ది రోజుల క్రితం దాడి చేశారు. తనిఖీల్లో భారీగా విదేశీ మద్యం బయటపడింది. డ్రగ్స్ అనుమానాలు ఉండడంతో పరీక్షలు చేయగా, విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. గుట్టంతా ఫోన్లలో ఉందేమోనని కూపీ లాగుతున్నారు పోలీసులు.

ఆబ్కారీ శాఖ కార్యాలయానికి రాజ్ పాకాల

శుక్రవారం లాయర్‌ను వెంటబెట్టుకుని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పీఎస్‌కు వెళ్లారు రాజ్ పాకాల. జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విదేశీ మద్యం ఎక్కడిది? ఎవరి దగ్గర కొనుగోలు చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్ మద్దూరిని కూడా పిలిచి వివరాలు సేకరించారు. రెండు రోజుల క్రితం కూడా వీరిని విచారించగా, పోలీసుల ప్రశ్నలకు తప్పించుకునే ధోరణిలోనే సమాధానాలు చెప్పినట్టు సమాచారం.

విచారణకు ఓరియన్ నాగేశ్వర్ రెడ్డి

ఓరియన్ విల్లాస్‌లో ఉండే నాగేశ్వర్ రెడ్డి కూడా శుక్రవారం విచారణకు హాజరయ్యాడు. చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు ఆయన్ను విచారించారు. జన్వాడ ఫాంహౌస్ పార్టీకి సంబంధించి ఈ విచారణ జరిగింది. కొద్ది రోజుల క్రితం నాగేశ్వర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు. రాజ్ పాకాల ఉండేది విల్లా 40లో కాగా, దానికి దగ్గరలో ఉండే విల్లా 43లో 12 బాటిళ్లు దొరికాయి. వాటిని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు, విచారణకు హాజరు కావాల్సిందిగా నాగేశ్వర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో న్యాయవాదితో కలిసి పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యాడు.

Related News

Flood water into bus : ఆర్టీసీ బస్సులోకి వరద నీరు.. స్మార్ట్ సిటీలోనే ఇంత దారుణమా?

Hospital Land Occupied : కబ్జారాయుళ్ల ఓవరాక్షన్.. ఆసుపత్రి స్థలానికే ఎసరు.. రంగంలోకి హైడ్రా.?

Chit Fund Company Fraud : మా డబ్బులు ఏవి.?.. చిట్ ఫండ్స్ మాయాజాలం.. బాధితులు కన్నీళ్ల పర్యంతం

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!

Momos Issue: కల్తీ మోమోస్ తయారు చేసిన.. బీహార్‌ గ్యాంగ్‌ అరెస్ఠ్..!

KTR Padayatra: కేటీఆర్ పాదయాత్ర.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Big Stories

×