YS Vijayamma : తన స్వార్థం కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఏమైనా చేస్తాడని, ఎంతకైనా తెగిస్తాడంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్న టీడీపీ.. నాలుగేళ్ల నాటి ఓ ఘటనను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. వైఎస్ షర్మిళతో జగన్ ఆస్తుల గొడవలు తీవ్రమవుతున్న తరుణంలో.. వైఎస్ విజయమ్మను హత్య చేసేందుకు జగన్ కుట్ర చేశాడా..? అంటూ సరికొత్త వాదనను లేవనెత్తింది. ఆ నాటి ఘటనపై ఇప్పుడు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇంతకీ.. ఆ ఘటన ఏంటి.? ఆస్తుల గొడవకు ఆ ఘటనకు కారణాలేంటి.?
అధికారం కోల్పోయి బాధలో ఉన్న జగన్ కు.. అన్ని వైపుల నుంచి ఒకేసారి వ్యతిరేకత ఎదురవుతోంది. సొంత కుటుంబ సభ్యులైన వైఎస్ షర్మిల.. ఆస్తుల పంపకంలో తనను అన్న జగన్ మోసం చేశాడంటూ రచ్చ చేస్తుండగా.. వైఎస్ విజయమ్మ సైతం కూతురి పక్షానే నిలబడింది. ఓ బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే.. చూస్తూ ఉండలేకపోతున్నా అంటూ ఘాటు లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించారు. మరోవైపు.. కూటమి ప్రభుత్వం జగన్ పాలనలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అన్ని శాఖల్లో లోతుగా రివ్యూలు చేస్తోంది. ఇంకో వైపు.. గతంలో జగన్ తన తల్లిని హత్య చేసి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశాడంటూ టీడీపీ సోషల్ మీడియా ఆరోపిస్తోంది.
2019 ఎన్నికల్లో వైఎస్ వివేకాను చంపి.. రాజకీయంగా సానుభూతి పొందిన వైఎస్ జగన్, అదే తరహాలో వైఎస్ విజయమ్మపై హత్యకు కుట్ర చేశారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. 2022 లోనే అందుకు ప్రయత్నించారని అంటోంది. 2022 ఆగస్టులో ఓ ఫంక్షన్ లో పాల్గొనేందుకు కర్నూలు వెళ్లిన విజయమ్మ… హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో గుత్తి దగ్గర కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఆ ఘటనలో విజయమ్మకు ఏం కాకపోయినా.. కొత్త కారుకు అలా ఎలా జరిగింది.? అంటూ టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Also Read : ఆడపిల్ల పెళ్లిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పెళ్లైతే అంతేనా?
ఆరోజు ఘటనకు సంబంధించి టైర్లు ఊడిపోయిన కారు ఫోటోలు షేర్ చేస్తూ.. అత్యాధునక సెక్యూరిటీ, హై హెండ్ టయోటా వెల్ ఫెయిర్ కారు ఎలా ప్రమాదానికి గురైందని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పైగా రెండు టైర్లు ఒకేసారి పేలిపోయి, ఊడిపోవడం సాధారణంగా జరగదని అంటోంది. 2019 ఎన్నికలో బాబాయ్ ని లేపేసినట్లే 2024 ఎన్నికల్లో మరో పెద్ద తలకాయను జగన్ టార్గేట్ చేశాడేమో అంటూ సంచలన ఆరోపణలు చేసింది.. టీడీపీ సోషల్ మీడియా.
త్వరలోనే జగన్ పై విచారణ..?
జగన్ ఆస్తుల గొడవ ఇప్పుడు బయటపడిందంటున్న టీడీపీ సోషల్ మీడియా.. అంతర్గతంగా చాన్నాళ్ల నుంచి ఇది వాళ్ల మధ్య రగులుతోందని, ఈ కారణంగానే వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర జరిగిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆ సమయంలో విజయమ్మకు ఏమైనా అయితే.. అటు ఆస్తుల పరంగా, ఇటు రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించాడంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు విచారణ జరపాలని, జగన్ పాత్రపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ సైతం క్రమంగా పట్టాలెక్కుతోంది. జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న వివేకా కేసు విచారణ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. సరిగా ఈ సమయంలోనే విజయమ్మపై కారు కుట్రపై విచారణ చేయాలని టీడీపీ సోషల్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తోంది.
రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు… వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు… pic.twitter.com/GWGdbXm6xz
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024