EPAPER

Facial Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా.. అయితే విషయాలు తప్పక తెలుసుకోండి

Facial Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా.. అయితే విషయాలు తప్పక తెలుసుకోండి

Facial Tips: ప్రస్తుతం చాలా మంది ముఖానికి సన్ స్క్రీన్ వాడుతున్నారు. సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం ద్వారా చర్మానికి కలిగే హానిని తగ్గించవచ్చు. కానీ సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కూడా చాలా మంది టానింగ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.సన్‌స్క్రీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే టానింగ్ రావచ్చు.


సన్‌స్క్రీన్‌ని అప్లై చేయడం వల్ల చర్మానికి సూర్యుడి నుండి రక్షణ లభిస్తుందని మనందరికీ తెలుసు.అయితే సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కూడా చాలా సార్లు స్కిన్ టాన్ అవుతుందని మీకు తెలుసా? ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మీరు సన్‌స్క్రీన్‌ను సరిగ్గా అప్లై చేయడం లేదని అర్థం. అందుకే సన్‌స్క్రీన్ అప్లై చేయడంలో చాలా మంది చేసే కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుదాం.

ప్రతి బ్యూటీ ప్రొడక్ట్‌ను అప్లై చేసే ముందు, మీ చర్మం ఎలాంటిదో తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా సన్‌స్క్రీన్‌ని ఎంచుకునేటప్పుడు.. జిడ్డు చర్మం ఉన్నవారికి జెల్ లాగా ఉండే సన్‌స్క్రీన్ బాగుంటుంది. లోషన్ లాగా ఉండే సన్‌స్క్రీన్ పొడి చర్మం ఉన్నవారికి సరిపోతుంది. చాలా మంది చర్మ రకానికి సరిపోయే సన్ స్క్రీన్ కాకుండా ఏదో ఒకటి ఉపయోగిస్తుంటారు. ఇలా వాడటం వల్ల ముఖం జిడ్డుగా మారుతుంది.


సరైన పరిమాణం ముఖ్యం:
సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం ఎంత ముఖ్యమో.. దాని సరైన పరిమాణం కూడా అంతే ముఖ్యం. 2 లేదా 3 వేళ్ల నియమాన్ని సన్ స్క్రీన్ అప్లై చేసే సమయంలో పాటించాలి. అంటే 2-3 వేళ్లకు సమానమైన సన్‌స్క్రీన్ ముఖానికి అప్లై చేయడం ద్వారా మాత్రమే చర్మం టానింగ్ నుండి రక్షించబడుతుంది. లేదంటే సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సన్ స్క్రీన్ మెడకు కూడా అప్లై చేయడం వల్ల అన్ని మంచి ఫలితం ఉంటుంది. కొంత మందికి మెడ బాగంలో ట్యాన్ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ఉపయోగించడం అవసరం.

సరైన సన్‌స్క్రీన్‌ ఎంపిక:
సన్‌స్క్రీన్‌ను ఎంచుకునే సమయంలో.. SPF, PA రేటింగ్‌పై కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, ఇది చర్మాన్ని టాన్ చేయడానికి కారణమయ్యే UVB కిరణాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అదే సమయంలో, PA అంటే ప్రొటెక్షన్ గ్రేడ్, UVA కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షిస్తుంది. ఇది చర్మంపై ముడతలు ఏర్పడేలా చేస్తుంది. మంచి సన్‌స్క్రీన్‌లో కనీసం SPF 50, PA+++ ఉండాలి.

బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే ఉపయోగించండి:
చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తుంటారు.మీరు ఇంట్లోనే ఉన్నా కూడా కనీసం రోజుకు మూడు సార్లు సన్‌స్క్రీన్ రాసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సూర్యరశ్మి కాకుండా, కాలుష్యం , దుమ్ము కారణంగా, చర్మం యొక్క రంగు మారుతుంది. ఫలితంగా టానింగ్ సమస్య ఉంటుంది. కాబట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే దీనిని అప్లై చేయడం వంటి పొరపాటు చేయవద్దు. ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ ఉపయోగించండి.

Also Read: ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

మాయిశ్చరైజర్‌తో కలపండి:
చాలా మంది వ్యక్తులు తమ రోజువారీ చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్‌ని చేర్చుకుంటారు. సన్‌స్క్రీన్‌ని ఇతర క్రీమ్‌లు, మాయిశ్చరైజర్‌లతో కలపడం మంచిది కాదని మీకు తెలుసా? నిజానికి ఇలా చేయడం వల్ల సన్‌స్క్రీన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే మీ చర్మం టాన్ అవుతుంది.

Related News

Rajugari kodi pulao: రాజు గారి కోడి పులావ్ రెసిపీ ఇదిగోండి, తిన్నారంటే మై మరిచిపోతారు

Gut Health: ఈ అలవాట్లు మీకుంటే మీ పొట్ట ఆరోగ్యం చెడిపోవడం ఖాయం

Skin care: జిడ్డు చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? వేపాకులను ముల్తానీ మిట్టితో ఇలా వాడండి చాలు

US woman blind : సముద్రంలో స్నానం.. చూపు కోల్పోయిన అమెరికా మహిళ, అసలు ఏమైంది?

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Big Stories

×