EPAPER

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!

హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. ఉద‌యం నుండి ఎండ కొట్ట‌గా ఉన్న‌ట్టుండి సాయంత్రం నాలుగు గంట‌ల స‌మ‌యంలో వ‌ర్షం దంచికొట్టింది. దీంతో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు రోడ్ల‌పైకి రావ‌డంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.


గచ్చిబౌలి డీఎల్‌ఎప్ రూట్‌లో రోడ్డుపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు వేరే మార్గం గుండా వెళ్లాలని వాహనదారులకు సూచించారు. నీటిని మళ్లించడానికి సహాయక చర్యలు చేపట్టారు. అదే విధంగా హఫీజ్ పేట్ ప్లైఓవర్ నుండి కొండా పూర్ వెళ్లే దారిలో సైతం భారీగా వర్షపు నీరు రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం నెలకొంది. మియాపూర్ పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను మల్లించే ప్రయత్నం చేశారు. నీటిని ఖాళీ చేసి, రోడ్డు క్లియర్ చేయడానికి మ్యాన్ హోల్స్‌ను తెరిచారు.

జెఎన్‌టీయూ వద్ద సైతం భారీగా వర్షపు నీరు రోడ్డు పైకి చేరుకోవడంతో ఆ ప్రాంతం కాలువను తలపించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీతో నీటిని ఎత్తి పక్కన పోస్తున్నారు. అదే విధంగా కొండాపూర్, లింగంపల్లి, మియాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపైకి సైతం నీళ్లు రావడంతో ట్రాఫిక్ సమస్యలు నెలకొన్నాయి.


Related News

AP High Court: ఆడపిల్ల పెళ్లిపై హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు.. పెళ్లైతే అంతేనా?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

CM Chandra Babu: ఆ పేదింటిలో.. స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

MP Raghu Comments : కేసీఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ పార్టీల్లో.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అలా చేస్తే ఊరుకోం

Janwada Case: జన్వాడ కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్‌కు 2 రోజుల గడువిచ్చిన హైకోర్టు, విచారణకు విజయ్ గైర్హాజరు, వాట్ నెక్ట్స్?

Big Stories

×