EPAPER

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ, తెలంగాణ‌లో ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ‌విడుదలైంది. డిప్లమా ట్రైనీ ఎలక్ట్రికల్, డిప్లమా ట్రైనీ సివిల్, జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాలను ఈ నోటిషికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో https://www.powergrid.in/ అనే వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


దేశ వ్యాప్తంగా మొత్తం 802 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో సదరన్ రీజియన్ కింద ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రీజియన్‌లో మొత్తం 72 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో 29 అన్ రిజర్వ్డ్ కేటగిరి, 5 ఈడబ్ల్యూఎస్ కేటగిరి, 21 ఎస్సీ, 5 ఎస్టీ, 3 దివ్యాంగులు, 6 ఎక్స్ సర్వీస్ మ్యాన్, 2 డీఈఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారిగా అర్హత విషయానికి వస్తే… డీటీఈ పోస్టుకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లలో మూడేళ్ల రెగ్యులర్ డిప్లమా పూర్తిచేయాలి.

ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 70 శాతం మార్కులు రావాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే అర్హులు. ఇక డీటీసీ పోస్టుకు సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల రెగ్యులర్ డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఓబీసీ, జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 70 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే సరిపోతుంది. జేఓటీ (హెఆర్) పోస్టుకు బీబీఏ, బీబీఎం, బీబీఎస్‌లతో పాటు వాటికి సమానమైన కోర్సులో మూడేళ్ల రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పాస్ మార్కులు వస్తే సరిపోతుంది.


Related News

Bank of Maharashtra Jobs 2024: బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే రిక్రూట్మెంట్

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

Big Stories

×