Naga Vamsi About Ka Movie : దీపావళికి మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమరన్ (Amaran), లక్కీ భాస్కర్ (Lucky Bhaskar), క (KA), బఘీరా (Bagheera) సినిమాల్లో అమరన్, లక్కీ భాస్కర్, క సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ మూవీ వీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో క సినిమాపై, హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)పై నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) రెస్పాండ్ అయ్యాడు. ఎలాంటి కామెంట్స్ చేశాడు ఇప్పుడు చూద్ధాం…
సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు… నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) నుంచి ఏదో ఒక డైలాగ్స్ వస్తాయి. అవి వైరల్ అవుతాయి. లక్కీ భాస్కర్ రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాలో నెగిటివ్ పాయింట్స్ చెబితే, వారికి పార్టీ ఇచ్చి… ఫోటోలు దిగుతాను అంటూ కామెంట్స్ చేశాడు. అప్పుడు ఆ వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. పెయిడ్ ప్రిమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ (Ka Movie) మూవీ కూడా ఇదే దీపావళి సందర్భంగా థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీకి కూడా కొంత వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్ల పరంగా, థియేటర్ల పరంగా ఈ రెండు సినిమాలకు కంపిటీషన్ ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కాగా, సినిమా తర్వాత లక్కీ భాస్కర్ మూవీ టీం ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) ‘క’ మూవీ పై, హీరో కిరణ్ అబ్బవరంపై కామెంట్స్ చేశాడు. “కిరణ్ అబ్బవరం సంవత్సరంన్నర కష్టపడి, మొన్న ఈవెంట్‌లో ఆయన పెయిన్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి రెవెన్యూ వస్తుంది. దానికి హ్యాపీ ఫీల్ అవ్వాలి గానీ, కాంపిటీషన్ పెట్టుకుని ఏం సాధిస్తాం. వ్యూచర్‌లో కిరణ్ – నేను సినిమా చేయలేమా… కాంపిటిషన్ అంటే ఇప్పుడు ఇద్దరం కలిసి కొట్టుకొవాలా” అంటూ కాంపిటీషన్ ట్రోల్స్ పై మండి పడ్డాడు.
సాధారణంగా నాగ వంశీ (Naga Vamsi) తన సినిమాకు పోటీగా మరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఈ ఏడాది మొదట్లో ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ టైంలో అదే జరిగింది. ‘గుంటూరు కారం’ మూవీతో పాటు ‘హనుమాన్’ కూడా ఒకేసారి రిలీజ్ కావడంతో అప్పట్లో నాగ వంశీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అలాగే ‘గుంటూరు కారం’ మూవీ కలెక్షన్ల విషయంలో కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్లు ఫేక్ అంటూ టాక్ నడిచింది. దానిపై కూడా ఆయన స్పందించిన తీరు వివాదానికి దారి తీసింది. ఒకరకంగా ‘గుంటూరు కారం’ మూవీకి నెగెటివ్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ నాగ వంశీనే. ఈ నేపథ్యంలో మరోసారి నాగ వంశీ సినిమాకి ‘క’ వంటి చిన్న మూవీతో పోటీ నెలకొనడం, దానిపై ఆయన పాజిటివ్ గా రియాక్ట్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
పైగా ఆయన కిరణ్ అబ్బవరంతో సినిమా చేయడం గురించి నాగ వంశీ (Naga Vamsi) మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ మూవీ లవర్స్ ముందున్న మరో పెద్ద ప్రశ్న ఏంటంటే ఆయన చెప్పినట్టుగానే ‘లక్కీ భాస్కర్’ మూవీ విషయంలో మైనస్ పాయింట్స్ వెతికిన వారికి పార్టీ ఇస్తారా? అనేది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లో ఉన్న మూడు సినిమాల్లోనూ ‘లక్కీ భాస్కర్’ వెనుకబడింది అనేది వాస్తవం. సినిమాలో మైనస్ పాయింట్స్ ఉంటేనే కదా ఇలాంటి రెస్పాన్స్ దక్కేది. మరి ఈ విషయంలో నాగ వంశీ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆసక్తికరంగా మారింది..