ఏపీలో అధికారంలోకి వచ్చిన తరవాత టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన మార్క్ పాలనతో ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపినీ పథకాన్ని ప్రారంభించారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం నుండి పథకాన్ని ప్రారంభించి ఉచిత సిలిండర్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఉచిత సిలిండర్ అందజేయడంతో పాటూ తానే స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టడం విశేషం. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఉండగా వారితో సరదాగా మాట్లాడుతూ చంద్రబాబు టీ పెట్టారు. పాలు ఉన్నాయా అమ్మా..అందరికీ టీ పెట్టి ఇవ్వు అని శాంతమ్మతో జోకులు వేశారు. అంతే కాకుండా రామ్మోహన్ ఈ టీ కి డబ్బులు సెంట్రల్ నుండి తీసుకురావాలంటూ నవ్వులు పూయించారు.
ఇదివరకు కట్టెలపొయ్యిపై ఎలా వంట చేసేదానివని శాంతమ్మను అడగగా చాలా కష్టంగా ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల నొప్పులు, ఒంటినొప్పులు ఉండేవని చాలా కష్టం అని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల క్రితం మీరు అధికారంలోకి వచ్చినప్పుడే ఉచిత సిలిండర్ ఇచ్చారని శాంతమ్మ చంద్రబాబుతో చెప్పారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు అక్కడ ఉన్నవారితో కలిసి టీ తాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు టీ పెట్టి పేదింట్లో వారితో సరదాగా జోకులు వేస్తూ గడపడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు…!
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసి తానే స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు.… pic.twitter.com/4QM6JTZJBp
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2024