Russia Google| ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్, అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ కూడా ఈ కంపెనీకి చెందినదే. అయితే ఈ అమెరికన్ కంపెనీపై రష్యా ఉక్కుపాదం మోపింది. ఏకంగా 20 డెసిలియన్ అమెరికన్ డాలర్ల జరిమానా విధించింది.
రష్యాలోని ఓ కోర్టు గూగుల్ కంపెనీపై 20 డెసిలియన్ డాలర్లు జరిమానా విధించింది. ప్రపంచ జిడీపీ కంటే 620 రెట్లు ఇది ఎక్కువ. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల జిడీపీ మొత్తాన్ని 620 సార్లు జోడిస్తే అప్పుడు ఈ జరిమానా మొత్తానికి సమానమవుతది. ఈ మొత్తాన్ని అంకెల రూపంలో చూడాలంటే 2 తరువాత 34 జీరోలుగా కనిపిస్తుంది.
ఎందుకు ఈ ఫైన్?
గూగుల్ కంపెనీ 2020 సంవత్సరం నుంచి రష్యా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానెళ్లు బ్లాక్ చేస్తుంది. అయితే ఈ ఛానెళ్ల యజమానులు గూగుల్ కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారు. అయితే 2020లోనే రష్యా కోర్టు ఛానెళ్లపై పెట్టిన బ్యాన్ తొలగించాలని గూగుల్ ను ఆదేశించింది. కానీ గూగుల్ కంపెనీ కోర్టు ఆదేశాలను పాటించలేదు. దీంతో కోర్టు బ్యాన్ తొలగించకపోతే ప్రతిరోజు 1 లక్ష రూబెల్స్ (రష్యా కరెన్సీ) చెల్లించాలని జరిమానా విధించింది. ఈ జరిమానా చెల్లించేందుకు గూగుల్ కంపెనీకి కోర్టు 9 నెలల గడువు విధించింది.
గడువు లోపల జరిమానా చెల్లించి.. ఛెనెళ్లపై నిషేధం తొలగించాలి.. లేకపోతే 9 నెలల దాటాక ప్రతి గంటకు ఈ మొత్తం రెండింతలు అవుతుంది. అలా ఇప్పుడు 2024 సంవత్సరానికి ఈ జరిమానా మొత్తం 20 డెసిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read: ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు
2022 సంవత్సరంలోనే గూగుల్ కంపెనీ రష్యాలో దివాలా తీసినట్లు ప్రకటించింది. కానీ గూగుల్, యూట్యూబ్ సర్వీసులు ఇప్పటికీ రష్యాలో అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా కంపెనీలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్స్ పై రష్యా పూర్తిగా నిషేధం విధించింది. కానీ గూగుల్ ఇప్పటికీ రష్యాలో సేవలందిస్తోంది. కానీ గూగుల్ కంపెనీ రష్యాలో నామమాత్రంగానే పనిచేస్తోంది.
అయితే తాజాగా రష్యా కోర్టు విధించిన జరిమానా 20 డెసిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానా మారింది. ఇంత పెద్ద భారం మోపినా రష్యాలో తమ సేవలు నిలిపివేసే ఆలోచన తమకు లేదని గూగుల్ ప్రతినిధులు తెలిపారు.
భారీ జరిమానా విషయంలో రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. “రష్యా ప్రభుత్వం తమ యూట్యూబ్ ఛానెళ్ల బ్యాన్ విషయంలో చాలా సీరియస్ గా ఉందనేందుకు ఈ ఫైన్ ఒక ఉదాహరణ. ఈ ఫైన్ మొత్తం ఎంత ఉందో లెక్కించడానికి, పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. గూగుల్ ఇప్పుడైనా తన తీరు మార్చుకోవాలి” అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి యూట్యూబ్ లో ఎక్కువగా రష్యా వ్యతిరేక సమాచారమే ప్రసారమవుతోందని.. రష్యా గూగుల్ పక్షపాత ధోరణికి పాల్పడుతోందని ఆరోపణలు చేసింది.
రష్యాతోపాటు గత 10 సంవత్సరాలలో ఇతర దేశాలు కూడా గూగుల్ కంపెనీపై జరిమానాలు విధించాయి. రష్యా కాకుండా ఇతర జరిమానాలు అన్ని కలిపితే మొత్తం రూ.11620 కోట్లు గా ఉంది. ఇందులో అక్టోబర్ 21, 2022న అన్‌ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీసెస్ కి గాను భారత ప్రభుత్వం గూగుల్ కంపెనీపై రూ.1338 కోట్ల జరిమానా విధించింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా డిజిటల్ మార్కెటింగ్ లో గూగుల్ ఇతర పోటీ కంపెనీల యాడ్స్ చూపించకుండా ఉన్నందుకు ఫైన్ విధించింది.