Richest Temples In India: భారతీయ సంప్రదాయం, సనాతన సంస్కృతిలో దేవాలయాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మన విశ్వాసానికి అలాగే మన గొప్ప మత వారసత్వానికి చిహ్నం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ప్రకారం, భారతదేశంలో ‘ఆలయ ఆర్థిక వ్యవస్థ’ విలువ రూ. 3.02 లక్షల కోట్లు ($40 బిలియన్లు). ఇది ప్రతి సంవత్సరం పెరుగుతోంది.
భారతదేశంలో 5 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ, వీటిలో కొన్ని ఆలయాలకు ప్రతి సంవత్సరం కోట్ల విలువైన కానుకలు అందుతున్నాయి. అనేక రాష్ట్రాల GDP కంటే ఎక్కువ సంపద కలిగిన భారతదేశంలోని 10 ధనిక దేవాలయాల గురించి తెలుసుకుందాం.
దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలు, వాటి వార్షిక ఆదాయం:
తిరుపతి వెంకటేశ్వర దేవాలయం(ఆంధ్ర ప్రదేశ్)-1450-1613 కోట్లు
పద్మనాభస్వామి దేవాలయం(కేరళ)- 650-700 కోట్లు
గోల్డెన్ టెంపుల్ (పంజాబ్)- 500 కోట్లు
వైష్ణో దేవి ఆలయం(జమ్మూ కాశ్మీర్)- 400 మిలియన్లు
షిర్డీ సాయి దేవాలయం(మహారాష్ట్ర)- 400 మిలియన్లు
అయోధ్య రామ మందిరం(ఉత్తర ప్రదేశ్)- 400 మిలియన్లు
పూరీ జగన్నాథ దేవాలయం (ఒడిషా) – 230-240 కోట్లు
సిద్ధి వినాయకుడి ఆలయం(మహారాష్ట్ర)-100-150 కోట్లు
అక్షరధామ్ ఆలయం(న్యూఢిల్లీ)- 60-100 కోట్లు
సోమనాథ్ ఆలయం( గుజరాత్)- 50-100 కోట్లు
1.తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం:
వార్షిక ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వేంకటేశ్వరాలయం ముందంజలో ఉన్నట్లు ఓ నివేదికలో ప్రచురితం అయింది. ఈ ఆలయ వార్షిక ఆదాయం 1600 కోట్లు. ఇక్కడ విరాళాలే కాకుండా ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతాలు, రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. ఏటా దాదాపు రూ.650 కోట్ల విరాళాలు వస్తుంటాయి. ఆలయ ట్రస్టు వద్ద 9 టన్నుల బంగారం నిల్వలు, రూ.14 వేల కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి.
2. పద్మనాభస్వామి ఆలయం :
రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం. ఒక నివేదిక ప్రకారం, ఆలయంలోని 6 సేఫ్‌లలో 20 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి ఉంది. ఇది మాత్రమే కాదు, ఆలయ గర్భగుడిలో విష్ణువు యొక్క బంగారు విగ్రహం ఉంది. దీని విలువ రూ. 500 కోట్లు. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు , శిల్పాలు కూడా ఉన్నాయి.
3. గోల్డెన్ టెంపుల్ :
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని దర్బార్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో బంగారు విగ్రహాలు, బంగారం, పచ్చ, పురాతన వెండి, వజ్రాలు మరియు ఇత్తడి విలువైన వస్తువులు ఉన్నాయి. ఆలయ గోపురం 24 క్యారెట్ల బంగారంతో చేయబడింది. ఆలయ వార్షిక ఆదాయం దాదాపు రూ.500 కోట్లు. ఇది సిక్కు మతం యొక్క ప్రధాన మత స్థలం. ప్రతిరోజు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు ఇక్కడ ఉచిత భోజనం (లంగర్) తింటారు. లంగర్‌లో 7000 క్వింటాళ్ల గోధుమలు, 1300 కిలోల పప్పులు, 1200 కిలోల బియ్యం, 500 కిలోల వెన్న వినియోగిస్తుంటారు.
4. వైష్ణో దేవి ఆలయం:
జమ్మూ కాశ్మీర్ కత్రాలోని వైష్ణవ దేవి ఆలయం. అమ్మవారి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి ఈ ఆలయానికి వస్తుంటారు. వైష్ణో దేవి ఆలయ వార్షిక ఆదాయం దాదాపు 500 కోట్ల రూపాయలు. జమ్మూ ఆర్థిక వ్యవస్థలో వైష్ణవ దేవి భక్తులకు ముఖ్యమైన సహకారం ఉంది. ఆలయంలోని గుహలో మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మీలు కొలువై ఉన్నారు.
5. అయోధ్య రామాలయం:
రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు అయోధ్య రామాలయానికి వస్తుంటారు. గతేడాది వివిధ మాధ్యమాల నుంచి రామ్ లల్లా రూ.363 కోట్ల విరాళాలు అందుకున్నారు. వడ్డీతో కలిపి శ్రీరామ ఆలయ వార్షిక ఆదాయం రూ.400 కోట్లకు చేరింది. ఇది వైష్ణోదవి, షిర్డీ సాయి దేవాలయం , గోల్డెన్ టెంపుల్ యొక్క వార్షిక ఆదాయానికి ఇది సమానం.
Also Read: 500 ఏళ్ల తర్వాత 2 గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి దీపావళి నుంచి అన్నీ మంచి రోజులే
6. మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయం:
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ప్రసిద్ధి చెందిన సాయిబాబా ఆలయం. ఇది షిర్డీ సాయి దేవాలయం పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ వార్షిక ఆదాయం రూ.400 కోట్లు. దేశంలోనే ధనిక దేవాలయాలలో ఇది మూడవది. 380 కిలోల బంగారం, 4 వేల కిలోల వెండి, వివిధ దేశాల కరెన్సీలతో సహా పెద్ద మొత్తంలో డబ్బు షిర్డీ సాయి ఆలయ బ్యాంకు ఖాతాలలో జమ చేయబడింది. ఆలయ ఖాతాలో రూ.1,800 కోట్ల నగదు కూడా ఉంది.
7.పూరీ జగన్నాథ దేవాలయం:
ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రం. 11వ శతాబ్దంలో స్థాపించబడిన ఈ ఆలయం చార్ ధామ్ యాత్రలో భాగం. ఆలయ ట్రస్టుకు 30 వేల ఎకరాల భూమి ఉంది. కాగా, ఆలయ వార్షిక ఆదాయం దాదాపు 240 కోట్లు. జగన్నాథ ఆలయంలో రత్నాల గది ఉంది. జగన్నాథ, బలభద్ర , సుభద్రల విలువైన ఆభరణాలు, అరుదైన రత్నాలు ఇక్కడ ఉంచారు.