Amaran Day 1 Collections : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) కలిసి నటించిన బయోపిక్ ‘అమరన్’ (Amaran). తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్ గా దీపావళి కానుకగా అక్టోబర్ 31న భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే కలెక్షన్లపరంగా రికార్డులను బ్రేక్ చేయడం మొదలు పెట్టింది. మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసుకుందాం పదండి.
మేజర్ ముకుంద వరదరాజన్ బయోపిక్ గా రూపొందింది ‘అమరన్’ (Amaran). ఈ సినిమాలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటించారు. మంచి హైప్ తో రిలీజ్ అయిన ‘అమరన్’ (Amaran) సినిమాకు ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ దక్కింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. దీపావళి నాడు రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఇండియాలో రూ.21 కోట్ల నెట్ కలెక్షన్స్ రావడం విశేషం. ఇది శివ కార్తికేయన్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
‘అమరన్’ (Amaran) మూవీకి ఓపెనింగ్ డే వచ్చిన రూ.21 కోట్ల కలెక్షన్స్ లో రూ. 17.7 కోట్లు తమిళనాడులోనే రాబట్టింది. కర్ణాటకలో రూ.2 లక్షలు, హిందీ వెర్షన్ రూ. 12 లక్షలు, తెలుగు వెర్షన్ 3.8 కోట్లు, మలయాళంలో లక్ష కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ‘అమరన్’ మూవీ ఫస్ట్ డే 4.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. తమిళం తర్వాత ఈ మూవీకి తెలుగులోనే భారీ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ‘అమరన్’ మూవీకి ఓపెనింగ్ డే రూ.25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాగా, ఓవర్సీస్ లో రూ.9 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా రూ.34 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసుకుంది.
తమిళనాడులో స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. ‘అమరన్’ (Amaran) మూవీకి తమిళనాడులో ఫస్ట్ డే మొత్తంగా 74.94% ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The Greatest of All Time) మూవీ రికార్డును బ్రేక్ చేసి, ఈ ఏడాది రిలీజ్ అయిన రోజే బుక్ మై షోలో ఒక గంట గ్యాప్ లో అత్యధిక టికెట్స్ అందుకున్న సినిమాగా ‘అమరన్’ నిలిచింది. విజయ్ మూవీకి ఒక గంటలో 32.16 వేల టికెట్లు అమ్ముడైతే, ‘అమరన్’ మూవీకి గంటలోనే 32.57 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’ మూవీ 31.86 వేల టికెట్స్ తో మూడో స్థానంలో ఉండగా, కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ 25.78 వేల టికెట్స్ తో నాలుగో స్థానంలో నిలిచింది.