Naga Vamsi : ఒకరకంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ (NTR ), ఏఎన్ఆర్ (ANR), ఎంజీఆర్ (MGR) కాలం నుంచే సినిమాకి, రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న చాలామంది అగ్రనటులు రాజకీయాలలోకి వెళ్లి ముఖ్యమంత్రులుగా కూడా చలామణి అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు టాలీవుడ్ లో ఎన్టీఆర్ అటు కోలీవుడ్ లో ఎంజీఆర్ లాంటి అగ్ర నటులు తమ సినిమాల ద్వారా నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతేకాదు ఇటు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. సొంత పార్టీలు పెట్టి ప్రజల మన్ననలు చూరగొని, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు.
స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా చేస్తా – నాగవంశీ
ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది రాజకీయ నాయకుల జీవిత కథలు ఇప్పటికే తెరపై చూపించారు దర్శకులు. మరోవైపు రాంగోపాల్ వర్మ లాంటి క్రియేటివ్ డైరెక్టర్లు కూడా ప్రస్తుత జరుగుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని.. రాజకీయ నాయకుల మధ్య జరిగే ప్రజలకు ఎన్నో తెలియని విషయాలను కూడా సినిమా రూపంలో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే 2029 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని ఒక స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా చేస్తానని ప్రకటించారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi). తాజాగా లక్కీ భాస్కర్(Lucky Bhaskar) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ..” వచ్చే ఏడాది ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ సినిమా మొదలు పెడతాము. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రారంభిస్తాము. కచ్చితంగా ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరు చూడని విధంగా తెరకెక్కిస్తాము” అంటూ సినీ ప్రేక్షకులకు ఒక బిగ్ అప్డేట్ వదిలారు సూర్యదేవర నాగవంశీ. ఇక ఈ విషయం తెలిసి జగన్ మోహన్ రెడ్డి ను ఉద్దేశించి సినిమా చేస్తారా..? లేక కూటమి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తారా..? అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
నాగవంశీ నిర్మించిన సినిమాలు..
ఇక సూర్యదేవర నాగవంశీ విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు. దాదాపు ఈయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు ఇటు నిర్మాతగా కూడా సూర్యదేవర నాగవంశీకి మంచి పేరు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఇక ఈయన నిర్మించిన చిత్రాల విషయానికి వస్తే.. 2017 లో నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి.. అలా వైకుంఠపురంలో , అరవింద సమేత వీర రాఘవ, భీమ్లా నాయక్ , అజ్ఞాతవాసి, సన్నాఫ్ సత్యమూర్తి, భీష్మ, జులాయ్ వంటి పలు చిత్రాలు నిర్మించారు. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం క, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలు నిర్మించి విడుదల చేశారు. ఇందులో లక్కీ భాస్కర్ హిట్ గా నిలవగా , క చిత్రం యావరేజ్ గా నిలిచింది.
2029 ఎలక్షన్ లోపు స్టార్ హీరో తో పొలిటికల్ సినిమా
మీరు ఏ హీరో అనుకుంటున్నారో కామెంట్ చేయండి ? #nagavamsi #DulquerSalmaan #nagavamsi #LuckyBaskhar #NBK109 #sitaraentertinements @vamsi84 @SitharaEnts pic.twitter.com/P5s0Zu5RCk
— BigTv Cinema (@BigtvCinema) November 1, 2024