EPAPER

Beauty Tips: ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Beauty Tips: ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Beauty Tips:  ప్రతి ఒక్కరు అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అందంగా ఉండాలని అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అంతే కాకుండా అందుకోసం పార్లర్లలో చాలా డబ్బును ఖర్చు చేస్తారు. కానీ గ్లోయింగ్ స్కిన్ కోసం పార్లర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లకుండానే ఇంట్లోనే చౌకగా గోల్డెన్ ఫేషియల్ చేసుకోవచ్చు.


బిజీ లైఫ్‌ లో మీ కోసం మీరు సమయాన్ని తప్పకుండా కేటాయించుకోండి. ఈ సమయంలోనే ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ చేసుకోండి.ఫేషియల్ కూడా క్లీన్ లుక్ ఇస్తుంది. తరుచుగా ఈ ఫేషియల్ చేసుకోండి . మరి ఈ ఫేషియల్ ఎలా చేయాలి. ఇందుకు సంబంధించి ఎలాంటి పదార్థాలు మనకు అవసరం అవుతాయి అనే పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోల్డ్ ఫేషియల్ యొక్క దశ-1:


ఏదైనా ఫేషియల్ ముఖానికి ఉపయోగించే ముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ చర్మం శుభ్రంగా లేకుంటే.. మనం వాడే ఫేషియల్ మురికితో కలిసిపోయి మొటిమలు , ఇతర సమస్యలను కలిగిస్తాయి. పచ్చి పాలలో కాటన్ ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం సులభమైన మార్గం. పాలు.. మేకప్ మురికిని తొలగించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

గోల్డ్ ఫేషియల్ స్టెప్- 2:

రెండవ దశ స్క్రబ్బింగ్: ఇది బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ తొలగించి చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. ఇంట్లోనే స్క్రబ్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో 1 టీ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ తేనె, కాస్త నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 5-6 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసి, ఆపై చల్లటి నీటితో కడగాలి. చక్కెర సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది మృత చర్మ కణాలను తొలగిస్తుంది. తేనె చర్మానికి పోషణనిస్తుంది. నిమ్మరసం సహజమైన బ్లీచ్‌గా పనిచేస్తుంది.

గోల్డ్ ఫేషియల్ స్టెప్- 3: 
మూడవ, చాలా ముఖ్యమైన దశ ముఖానికి ఆవిరి తీసుకోవడం. ఆవిరి మన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. తద్వారా మురికిని లోతుగా శుభ్రపరుస్తుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజు ఆవిరిని తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఆవిరి పట్టడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావాలంటే ఆవిరి నీటిలో లవంగాలు, నిమ్మరసం , వేప ఆకులు కూడా వేయవచ్చు. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి .

Also Read: ఈ రోజు నుంచే ఇలా చేయండి.. వారం రోజుల్లో మీ ఫేస్ మెరిసిపోతుంది

గోల్డ్ ఫేషియల్ స్టెప్ – 4:

గోల్డ్ ఫేషియల్ చివరి దశలో, ఒక గిన్నెలో ఒక చెంచా కొబ్బరి నూనె, కాస్త తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం, అర చెంచా పసుపు, ఒక చెంచా పెరుగు వేసి మిక్స్ చేయండి కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేసి, ఆపై మీ ముఖానికి అప్లై చేయండి. దాదాపు 15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. దీని తరువాత, ముఖం కడిగాలి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా, మీరు సహజంగా మెరిసే చర్మం పొందుతారు.

Related News

Tomato Halwa: ఏదైనా కొత్తగా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తుందా? టమోటా హల్వా ప్రయత్నించండి

Winter Skin Care: చలికాలంలో స్కిన్ కేర్ తప్పనిసరి.. లేదంటే తిప్పలు తప్పవు

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే !

TB Problem: విజృంభిస్తున్న క్షయవ్యాధి, గతేడాది 80 లక్షల మందికి టీబీ వచ్చినట్టు చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Aloe Vera Hair Mask: కలబంద హెయిర్ సీరమ్‌తో కురుల సిరులను పెంచుకోండి!

Skin Care Routine: ఈ రోజు నుంచే ఇలా చేయండి.. వారం రోజుల్లో మీ ఫేస్ మెరిసిపోతుంది

Big Stories

×