EPAPER

Diwali 2024: దీపావళి బాంబుల శబ్దాలు మీకు మానసిక ఆందోళన పెంచుతున్నాయా? ఈ చిట్కాల ద్వారా ప్రశాంతంగా ఉండండి

Diwali 2024: దీపావళి బాంబుల శబ్దాలు మీకు మానసిక ఆందోళన పెంచుతున్నాయా? ఈ చిట్కాల ద్వారా ప్రశాంతంగా ఉండండి
Diwali 2024: కొందరు అతిశబ్దాలు వినలేరు. దీపావళి రోజు పెద్ద పెద్ద బాంబుల శబ్దాలు కొంత సున్నితమైన వారికి ఆందోళన కలిగిస్తాయి. వారిలో ఒత్తిడిని పెంచుతాయి. వారి శాంతియుతమైన జీవనానికి ఆటంకంగా మారుతాయి. పటాకులా పెద్ద శబ్దం మీరు వినలేరు. దీనివల్ల వారిలో యాంగ్జైటీ, ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలు వంటివి మొదలవుతాయి. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు చిన్న చిట్కాలను పాటించండి.


బెడ్ రూమ్‌లోనే ఉంటూ…
మీరు దీపావళికి  వచ్చే అతి పెద్ద శబ్దాలు వినలేక పోతే  ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. బెడ్ రూమ్‌లోనే మృదువైన దిండ్లు, దుప్పట్లు పెట్టుకొని మీకు నచ్చిన పుస్తకాలు పట్టుకొని చదివేందుకు ప్రయత్నించండి. మృదువైన దిండుపై తలపెట్టుకొని, దుప్పటిని కప్పుకొని ఇష్టమైన పుస్తకాన్ని చదివితే మీకు కాస్త రిలాక్స్ గా అనిపిస్తుంది. బయట నుంచి వచ్చే శబ్ధాలను తగ్గించుకోవడానికి కిటికీలు అన్నింటినీ మూసేయండి. అలాగే ఫోన్ చూడటానికి ప్రయత్నించండి. హెడ్ ఫోన్లు ఇయర్ ప్లగ్ లోకి పెట్టుకొని మీకు నచ్చిన సంగీతాన్ని వినేందుకు ట్రై చేయండి.

బాణాసంచా శబ్దాలు ఆకస్మికంగా వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. అలాంటప్పుడు మీరు లోతైన శ్వాస వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించండి. నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వంటివి ఆందోళన తగ్గిస్తాయి. ఒక దగ్గర కూర్చుని ఉచ్ఛాస నిచ్ఛాసలపై దృష్టి పెట్టండి. ఇది మీలో కాస్త ప్రశాంతతను తీసుకొస్తుంది. దీపావళి బాంబుల శబ్దాన్ని తట్టుకునే శక్తిని అందిస్తుంది.


ధ్యానం చేయడం
దీపావళి నాడు ఉదయం నుంచి మైండ్ ఫుల్ నెస్ ప్రయత్నించండి. ధ్యానం చేయండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే సాయంత్రం బాంబుల శబ్దాలు వస్తాయని ముందే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోండి. అన్ని తలుపులను, కిటికీలను మూసివేసి మీకు నచ్చిన సినిమాలో చూసేందుకు ప్రయత్నించండి.

అరోమాథెరపీ
అరోమా థెరపీ కూడా మానసిక ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శబ్దాల వల్ల మీకు హఠాత్తుగా యాగ్జయిటీ ట్రిగ్గర్ అయినా, మానసిక ఆందోళన మొదలైనా ఇంట్లో అరోమాథెరపీ ప్రయత్నించండి. అంటే మంచి సువాసన వీచే అగరబత్తులను వెలిగించడం, కొవ్వొత్తులను వెలిగించడం వంటివి చేయండి. అవి మీలో మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

దీపావళి నాడు ఒకానొక సమయంలో ఎక్కువగా పటాకులను పేలుస్తారు. ఆ శబ్ధాలను గరిష్ట స్థాయికి చేరిన సమయంలో మీరు అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఆ సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపకండి. కిటికీ తలుపులు వేసి పడకగదిలోనే మీకు నచ్చిన సినిమా చూసుకుంటూ గడిపేందుకు ప్రయత్నించండి. లేదా మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడేందుకు ట్రై చేయండి. ఇండోర్ కార్యాకలాపాలకే ఆసక్తిని చూపించండి. ఇలా మీరు మీ దృష్టిని మార్చుకోవడం వల్ల ఎంతో కొంత మీరు ఆ బాంబుల శబ్దాల వల్ల కలిగే ఆందోళన నుంచి తప్పించుకోగలరు.

ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, ముసలి వారు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి అధిక శబ్ధాలు ఇబ్బందిపెడతాయి. ఈ శబ్ధాలు వారిలో అలజడిని కలిగిస్తాయి. కాబట్టి దీపావళి బాంబుల శబ్ధాల భయం ఉన్నవారు ఇంట్లోనే ఉండడం ఉత్తమం.

Related News

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే !

TB Problem: విజృంభిస్తున్న క్షయవ్యాధి, గతేడాది 80 లక్షల మందికి టీబీ వచ్చినట్టు చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Beauty Tips: ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Aloe Vera Hair Mask: కలబంద హెయిర్ సీరమ్‌తో కురుల సిరులను పెంచుకోండి!

Skin Care Routine: ఈ రోజు నుంచే ఇలా చేయండి.. వారం రోజుల్లో మీ ఫేస్ మెరిసిపోతుంది

Peanuts or Chickpeas: పల్లీలు లేదా కొమ్ము శనగలు, ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది

Big Stories

×