Lucky Bhaskar Movie 1st day Collections.. ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈమధ్య తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు. మరొవైపు ఆయన సినిమాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుందనే బలమైన ముద్ర పడిపోయింది. అందుకే ఈయన నటించే ప్రతి సినిమా కూడా మంచి మెసేజ్ తో కూడుకొని ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దుల్కర్ సల్మాన్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
దీపావళి సందర్భంగా లక్కీ భాస్కర్..
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) హీరోయిన్ గా నటించగా.. సాయికుమార్, మానస చౌదరి , హైపర్ ఆది, సచిన్ ఖేడ్కర్ , రాంకీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాని తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ , మలయాళం భాషలో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. ఇకపోతే దుల్కర్ సల్మాన్ గత సినిమాలు కూడా క్లీన్ హిట్ కావడంతో లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి
రూ.35 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి..
తెలుగు రాష్ట్రాలలో రూ .15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు రాగా.. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషకం అలాగే ప్రమోషన్స్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులు మొత్తం కలుపుకొని ఈ సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా సుమారుగా 1100 స్క్రీన్ లలో ఇండియాలో విడుదల చేశారు . అటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1500 స్క్రీన్ లలో సినిమాను విడుదల చేశారు. కనీసం రూ.35 కోట్ల షేర్ , రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ కొట్టాల్సి ఉంటుంది. మరి మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
మొదటిరోజు కలెక్షన్స్..
లక్కీ భాస్కర్ తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.5.35 కోట్లు రాబట్టగా , తమిళనాడులో రూ.60 లక్షలు, మలయాళంలో రూ.3.10 కోట్లు , కర్ణాటకలో రూ.20 లక్షలు , ఓవర్సీస్ లో రూ .30 లక్షలు వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వసూళ్ల వేటను ప్రారంభించింది. ఇకపోతే ఇప్పుడు దీపావళి హాలిడేస్ కలిసి రావడం కారణంగా లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమా మరింత కలెక్షన్స్ వసూలు చేసేటట్టు కనిపిస్తోంది. రూ.100 కోట్ల వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో ఆ టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.