Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి కోపంగా ఇంటికి వచ్చి గార్డెన్ లోకి వెళ్లి అటూ ఇటూ చూసి ఆరు అని పిలుస్తుంది. ఇంతలో మనోహరి దగ్గరకు ఆరు వస్తుంది. చిన్న గాలి తగలగానే మనోహరి వచ్చావా ఆరు అంటూ ఎప్పుడు చూసినా ఆ మిస్సమ్మతో మాట్లాడతావు నీకు బోరు రాదా? ఆరు అంటూ నీ కుటుంబం అంతా నిన్ను కాపాడేసిందని తెగ ఆనందపడుతున్నావా? ఏంటి..? అమర్ కు నిజం చెప్పి వెళ్లమని నన్ను బెదిరిస్తున్నావా..? నా గురించి నీకు తెలుసు కదా ఆరు. నేను దేన్నైనా ఒక్కసారి నాది అనుకుంటే దాన్ని దక్కించుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తానని అంటుంది.
దీంతో ఆరు.. ఓడిపోతానన్న భయమే నీతో ఇలా మాట్లాడిస్తుంది మను. మిస్సమ్మ ఇంట్లో అందరి మనసు గెలుచుకుంది. నేనంటే నిన్ను నమ్మాను కాబట్టి నువ్వు మోసం చేయగలిగావు. కానీ మిస్సమ్మ అలా కాదు నిన్ను తొక్కి పట్టి నార తీస్తుంది అంటూ ఆరు మాట్లాడుతుంది. ఇంతలో మనోహరి నాకు తెలుసు ఆరు నువ్వు చాలా ఆనంద పడుతున్నావని. కానీ ఆ ఆనందం ఎక్కవు సేపు నిలవదు. నా ప్లాన్ ఏంటో తెలుసా..? నువ్వు ఏ పిల్లలకు అయితే దాన్ని దగ్గర చేయాలని చూస్తున్నావో.. ఆదే పిల్లల చేత దాన్ని బయటకు పంపిచేస్తాను. అంజును ఉపయోగించి కథంతా నడిపిస్తాను ఇక చూడు నా పవరేంటో అంటూ లోపలికి వెళ్లిపోతుంది.
మిస్సమ్మ పిల్లల రూంలో సర్దుతుంటే అంజు వేసిన అరుంధతి స్కెచ్ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూసి మిస్సమ్మ షాక్ అవుతుంది. అక్క ఫోటో ఇక్కడ ఉందేంటి..? అని డౌటు పడుతూ పిల్లలనే అడుగుదాం అని కిందకు వెళ్తుంది. అప్పుడే లోపలికి వస్తున్న మనోహరి.. మిస్సమ్మ చేతిలో ఉన్న ఆరు ఫోటో చూసి దీనికి ఇప్పుడు నిజం తెలిస్తే నా ప్లాన్ అంతా పాడవుతుంది. ఎలాగైనా దీన్ని ఆపాలని మనసులో అనుకుని మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. మిస్సమ్మ కోపంగా మనోహరి గారు ఇది నా ఇల్లు నేను ఎక్కడికైనా వెళ్తాను అని చెప్తుంది. దీంతో నువ్వు ఎక్కడికైనా వెళ్లు కానీ బయట నీ కోసం పక్కింటి అక్క వచ్చి ఎదురుచూస్తుంది చూడు అని చెప్తుంది మనోహరి. వెంటనే మనోహరి అవునా.. అక్క వచ్చిందా? అంటూ అయితే అక్కనే నిజం అడుగుతానని ఆ ఫోటో పట్టుకుని బయటకు వెళ్తుంది మిస్సమ్మ.
గార్డెన్ లో ఉన్న ఆరును పిలిచి అక్కా ఇది నీ స్కచ్ ఫోటోనే కదా? అని అడుగుతుంది. అవునని ఆరు చెప్పగానే మరి మా పిల్లల బెడ్ రూంలోకి నీ ఫోటో ఎలా వచ్చిందక్కా అని అడుగుతుంది మిస్సమ్మ. దీంతో ఆరు షాక్ అవుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుండి పోతుంది. దీంతో ఓహో నీకు తెలియదా..? అయితే పిల్లల్నే అడుగుతానని మిస్సమ్మ లోపలికి వెళ్లబోతుంటే నేనే మిస్సవ్వకుండా ఉంటారని ఇచ్చాను అని చెప్తుంది ఆరు. దీంతో ఏంటి మీరు మిస్సమ్మవకుండా ఉండటానికి మా పిల్లలకు ఇచ్చారా..? అని మిస్సమ్మ అడగ్గానే ఆరు కంగారుపడుతూ అది .. మా పిల్లలకు ఇచ్చాను మా పిల్లల దగ్గర నుంచి మీ పిల్లలు తీసుకున్నారట.
అది తెలిసి ఫోటో తీసుకెళదాం అని వచ్చాను అంటుంది ఆరు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే దూరం నుంచి మనోహరి గమనిస్తుంది. మిస్సమ్మ మాత్రం మళ్లీ అక్కా మీరేమో అందరికీ తెలుసు అంటారు. ఇంట్లో వాళ్లేమో మీరు తెలియదు అంటారు. ఎందుక్కా అని అడుగుతుంది. దీంతో ఆరు అంటే మిస్సమ్మ కలిసిన వాళ్లందర్ని గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టం కదా..? అని చెప్తుంది. పక్కింటి వాళ్లను ఎలా మర్చిపోతారు అక్కా.. పైగా చుట్టు పక్కల వాళ్లను ఎవర్ని అడిగినా మీరు తెలియదు అంటారు. అయినా మీ పేరేంటి అక్కా అని అడుగుతుంది. ఆరుకు ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తుంటే డోర్ దగ్గర నుంచి మనోహరి, మిస్సమ్మను పిలుస్తుంది.
పిల్లలు పడుకోవడానికి రెడీ అయ్యారు. నీకోసం ఎదరు చూస్తున్నారు…రా.. అంటుంది. దీంతో ఆరు కూడా మిస్సమ్మ మా పిల్లలు కూడా పడుకునే టైం అయింది. వెళ్తాను. రేపు కలుస్తాను అంటుంది. దీంతో మిస్సమ్మ సరే అక్కా అంటూ వెళ్లిపోతుంది. మనోహరి గార్డెన్ లోకి వచ్చి ఆరు చేతిలో ఫోటో తీసుకుని కోపంగా కాలి కింద వేసి తొక్కుతుంది. లోపలి నుంచి అంజు వచ్చి ఆంటీ మీరు ఒక్కరే మాట్లాడుకుంటున్నారేంటి అని అడుగుతుంది.
అంజు పిలుపునకు షాక్ అయిన మనోహరి వెంటనే తేరుకుని నా ఫ్రెండ్ ఆరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇలా వచ్చి మట్లాడతాను. తన మాటలు నాకు వినిపించవు కానీ నా మాటలు తనకు వినిపిస్తాయి కదా? అంటూ అసలు నువ్వెందుకు బయటకు వచ్చావు అని అడుగుతుంది మనోహరి. దీంతో నేను స్కెచ్ వేసుకున్న అమ్మ ఫోటో మిస్సమ్మ తీసుకుని బయటకు వచ్చింది. అందుకే వచ్చానని అంజు చెప్పడంతో.. దొరికావే మిస్సమ్మ ఇప్పుడు చూడు నీ కథ అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.