EPAPER

TDP VS Janasena: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

TDP VS Janasena: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

TDP VS Janasena: ఏపీలోని ఆ జిల్లాకు ఇంచార్జ్ మినిస్టర్ అంటే వామ్మో అనాల్సిందే. ఎందుకంటే ఆ జిల్లాలోని ఏ నియోజకవర్గాన్ని కదిలించిన సమస్యలు తేనెతుట్టెల్లా కదులుతాయి. అసలే మూడు పార్టీలు జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ తరుణంలో ఇంచార్జ్ మినిస్టర్ బాధ్యత చాలా క్రూషియల్ గా ఉంటుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ నుంచి వచ్చిన నేతలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు మంత్రికి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇంతకీ తిరుపతి జిల్లా కూటమిలో ఏం జరుగుతుంది.


ఐదేళ్లపాటు చుక్కలు చూపించిన వైసీపీ నేతలు.. పార్టీలోకి రాగానే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుపతి జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ముందు వాపోయారు తెలుగు తమ్ముళ్లు. తమ నాయకులే తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. తిరుపతి జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ పదవి అనేది కత్తి మీద సాములాంటిది. అలాంటి చోట ఇంచార్జ్ మంత్రిగా వచ్చిన అనగాని సత్యప్రసాద్ కు మొదటి రివ్యూలోనే షాకుల మీద షాకులు తగిలాయట. టీడీపీ కేడర్, జనసైనికులు తమ అసంతృప్తిని మంత్రి ఎదుట ప్రస్తావించారట. తమ సమస్యలకు వెంటనే ఓ పరిష్కారం చూపాలని కోరారు. వైసీపీ నుంచి టీడీపీలో వచ్చిన నేతలు మాత్రం MLAలకు మద్దతుగా మాట్లాడటం తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి మరింత కారణమైంది.


ఏడు నియోజకవర్గాలపై మంత్రి రివ్యూ

ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. అయితే అందులో సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట నియోజకవర్గాల చర్చలు హాట్ హాట్ గా జరిగాయంట. తిరుపతి నియోజకవర్గంలో అయితే వైసీపీ నేతల పెత్తనం పెరిగిపోయిందని మంత్రి ఎదుటే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారంట. MLA ఆరణీ శ్రీనివాసులతో పాటు మరోకరు షాడో MLAగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేసినట్టు టాక్.

మరోవైపు చిత్తూరు నుంచి వచ్చిన నేతలు సైతం పెత్తనం చేస్తున్నారన్ని ఫిర్యాదు చేసారట. అదేటైంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య వ్యవహార శైలిపై కూడా మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్లను కనీసం పట్టించుకోవడం లేదని మంత్రి ఎదుట వాపోయారట. కమిషనర్ ఒంటెద్దు పోకడలతో పోతున్నారని.. పార్టీ, ప్రభుత్వం గురించి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకుందని వారితోనే పనులు చేస్తుందని, అందులో వైసీపీ నేతలు కూడా ఉన్నారని మంత్రికి డీటెయిల్డ్ రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు వైసీపీ నేతలతో కలిసి కొందరు నాయకులు మద్యం సిండికేట్ దందాలు చేస్తున్నారని తెలియడంతో సమావేశం కాస్త రసాభాసగా మారిందట.

తమవాళ్లే పట్టించుకోవడం లేదని అసంతృప్తి

ఇక సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం ఎపిసోడ్ పైనా జోరుగానే చర్చ జరిగిందట. MLAతో పాటు వైసీపీ నుంచి వచ్చిన అతని అనుచరులు సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేయగా.. పాత టీడీపీ కేడర్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. దాంతో ఇరువర్గాల మధ్య మంత్రి ఎదుటే వాదోపవాదనలు జరిగాయట. అయితే మంత్రి అనగాని జోక్యం చేసుకుని MLA ఇష్యూ గురించి మాట్లాడవద్దని ఏమైనా పనులు కావాలంటే తనను సంప్రదించాలని సూచించినట్టు టాక్. భవిష్యత్ లో సత్యవేడు నియోజకవర్గానికి స్ంబంధించి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారట. ఓవరాల్ గా ఆదిమూలానికి టీడీపీలో డోర్స్ క్లోజ్ అయ్యాయని మంత్రి అనగాని చెప్పకనే చెప్పారట. ఇదే విషయంలో కేడర్ కూడా తీవ్రంగా చర్చించుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: పెద్ది రెడ్డిపై వైసీపీ లీడర్ల తిరుగుబాటు.. షాక్ తప్పదా..?

తిరుపతిలో వైసీపీ నేతల పెత్తనం

సూళ్లూరుపేట నియోజకవర్గంపైనా చర్చలు త్వరగా ముగిశాయట. MLA విజయశ్రీ కంటే వారి కుటుంబసభ్యుల పెత్తనం ఎక్కువైందని నేతలు.. మంత్రి అనగాని దృష్టికి తీసుకెళ్లారట. టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారిని కాదని.. వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రయారటీ ఇస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారట. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో MLA బొజ్జల తమను మిత్ర పక్షంగా పట్టించుకోవడం లేదంటూ జనసేన ఇన్ చార్జ్ కోటా వినూత ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు టీడీపీలోని కొంతమంది నేతలు కూడా ఇదే చెప్పారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో రాష్ట్రంలో కూటమి ఎలా పనిచేస్తుందో అన్నిచోట్ల అదే విధానం ఉంటుందని చెప్పారంట. గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాల రివ్యూ ప్రశాంతంగా ముగిసింది. అయితే చంద్రగిరి నేతలు కొందరు మూడు నెలలకే వైసీపీ నేతలు రోడ్ల మీదకు వచ్చి విమర్శలు చేస్తున్నారని పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహారించడమే ఇందుకు కారణమని మంత్రి ముందు ఆగ్రహంతో చెప్పారంట. దొంగఓట్ల కేసుతో పాటు ఇతర కేసుల్లో అరెస్టులు వేగంగా జరపాలని డిమాండ్ చేశారంట.

తిరుపతి నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతలతో ఇంచార్జ్ మినిస్టర్ అనగాని ప్రత్యేకంగా సమావేశమై ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్ లో పార్టీ మరింత బలపడే విదంగా చూడాలని చెప్పారంట. సత్యవేడుతో పాటు తిరుపతికి సంబంధించి కూడా త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓవరాల్ గా తిరుపతి విషయంలో త్వరలో పార్టీ అధ్యక్షుడు ఓ నిర్ణయం తీసుకుంటారని చెప్పాడంతో నేతలు శాంతించారంట. ప్రభుత్వ శాఖలలో ఇంకా వైసీపీ పెత్తనం నడుస్తుందని ఈవిషయంలో తగిన చర్యలు తీసుకోకపోతే కేడర్ లో అసంతృప్తి వస్తుందని చెప్పినట్లు సమాచారం. మొత్తం మీదా ఇన్ చార్జ్ మంత్రి రివ్యూలో మిత్ర పక్షంతో విభేదాలతో పాటు పార్టీలో ఉన్న అసంతృప్తి బయటపడినట్టైంది. దీనికి ఎలా చెక్ పెడుతారో చూడాలి.

Related News

Tension in Nellimarla: నెల్లమర్లలో టెన్షన్.. టీడీపీ వర్సెస్ జనసేన

US Election 2024: ఫైనల్ ఫైట్ వీళ్లు గెలిస్తేనే.. యుద్ధాలకు చెక్..?

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌..

KCR: జెండా ఎత్తేసిన కేసీఆర్.. మహా యుద్ధంలో వెనక్కు తగ్గడానికి కారణమిదే!

Peddireddy Ramachandra Reddy: పెద్ది రెడ్డిపై వైసీపీ లీడర్ల తిరుగుబాటు.. షాక్ తప్పదా..?

Best Tourist Place: రణగొణ ధ్వనులుండవ్! కాలుష్యం ఆనవాళ్లుండవ్!.. ఈ బ్యూటీఫుల్ నేచర్ స్పాట్ ఎక్కడో తెలుసా?

Big Stories

×