EPAPER

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Train advance reservation| ఇండియన్ రైల్వే తాజాగా ట్రైన్ టికెట్ బుకింగ్ లో కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న 120 రోజు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ని 60 రోజులకు తగ్గిస్తూ మార్పులు చేసింది. అంటే రిజర్వేషన్ లో రైలు ప్రయాణం చేయాలని భావించేవారు 60 రోజులు ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోగలరు. ఇంతకుముందు ఈ సౌలభ్యం 120 రోజులు ఉండగా.. దాన్ని రైల్వే శాఖ 60 రోజులకు తగ్గించింది. నియమాలలో ఈ మార్పులు నవంబర్ 1 2024 నుంచి అమలులోకి వస్తాయి.


అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఏ ఇబ్బందులు ఉండవు. వారి రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుంది. భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (Advance Reservation Period – ARP) లో ఈ మార్పులు ప్యాసింజర్ల వసతి కోసమే చేయబడింది. ఎందుకంటే 21 శాతం ప్యాజింజర్లు టికెట్ రిజర్వేషన్ 120 రోజులు ముందుగానే చేసుకొని ఆ తరువాత టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మరో 5 శాతం ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్నా.. ప్రయాణం చేయకుండా టికెట్ వృధా చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణం అవసరం, అత్యవసరం ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ మార్పుల్లో ఈ 5 కీలకం
1. రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన అడ్వాన్స్ రిజర్వేషన్ మార్పులు విదేశి ప్రయాణికులకు వర్తించదు. విదేశీయులు 365 రోజులు ముందుగానే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు.


2. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని పగటి పూట ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ పరిమితులు వర్తిస్తాయి.

3. అక్టోబర్ 31 2024 వరకు 120 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. అయితే 60 రోజుల కంటే ముందుగా చేసుకున్న రిజర్వేషన్ టికెట్లు కొత్త నియమాల ప్రకారం.. వెసులబాటుని బట్టి రద్దు కూడా చేసే అవకాశం ఉంది.

4. టికెట్ 120 రోజులు ముందస్తుగా రిజర్వేషన్ లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు కొంతమంది టికెట్లు రద్దు చేయకుండా ప్రయాణం మానేస్తున్నారు. దీనివల్ల వారి స్థానంలో కొంత మంది వేరే వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. నియమాల ప్రకారం.. ఇలా చేయడానికి అనుమతులు లేవు.

5. 1995-98 మధ్య అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 30 రోజుల పరిమితి మాత్రమే ఉండేని రైల్వే శాఖ గుర్తు చేస్తూ.. కొత్త నియమాల ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.

పరిమితికి మించి లగేజ్ తీసుకొని వస్తే ఫైన్ చెల్లించాలి
మరోవైపు రైల్వే శాఖ పరిమితికి మించి లగేజి తీసుకొని వస్తే.. ప్రయాణికులు తగిన ఫైన్ చెల్లించాల్సి వస్తుందని తెలిపింది. ఈ మేరకు వెస్ట్రన్ రైల్వే బుధవారం అక్టోబర్ 30 2024న ఒక ప్రకటన జారీ చేసింది. రైల్వేలో ఏ తరగతిలో ప్రయాణించినా.. వారి పరిమితి ప్రకారమే ఉచిత లగేజ్ తీసుకొని రావాలని.. అంతుకుమించి తీసుకొని వస్తే.. భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. అధిక లగేజి వల్ల ప్రయాణికుల అసౌకర్యంతో పాటు రైల్వే స్టేషన్ లో రద్దీ ఎక్కువ అవుతోందని.. ఈ కారణంగానే లగేజిపై ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అయితే ఉచిత లగేజిలో కూడా పరిమిత సైజు కంటే పెద్ద ఆకారంలో ఉన్న లగేజి కూడా అనుమతించేది లేదని వెల్లడించింది. ఉదాహరణకు ప్రయాణికులు స్కూటర్లు, సైకిళ్లు తీసుకొని రైలు ప్రయాణం చేయరాదు. లగేజీ సైజు 100 cm x 100 cm x 70 cm కంటే పెద్దది గా ఉంటే దానిపై ప్రయాణికుడు ఫైన్ చెల్లించాలి. దీంతోపాటు రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ప్రయాణికులు ట్రైన్ సమయం ప్రకారమే లోపలికి రావాలని కోరింది.

Related News

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Today Gold Rate: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

RPF Personal Praised: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ.. భలే కంట్రోల్ చేశారే, హైదరాబాద్ ఆర్పీఎఫ్‌లకు నెటిజన్స్ సెల్యూట్

Today Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెలవెలబోతున్న గోల్డ్ షాప్స్..!

Big Stories

×