EPAPER

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి కానుకలు పొందే అవకాశం మీకోసం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి కానుకలు పొందే అవకాశం మీకోసం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

TTD News: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.


తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను న‌వంబ‌రు 4 నుండి 11వ‌ తేదీ వరకు ఈ – వేలం ఆన్ లైన్ విధానంలో వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కొత్తవి ఉపయోగించిన పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నాయి.

ఇందులో ఆర్ట్ సిల్క్ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్ పాలిస్టర్ నైలాన్ నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్‌, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు, హుండీ గ‌ల్లేబులు, దిండుక‌వ‌ర్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి ప‌ర‌దాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని టీటీడీ ప్రకటన విడుదల చేశారు.


Also Read: Tirumala Darshan : తిరుమలలో సామాన్యులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటా…

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 63,987 మంది భక్తులు దర్శించుకోగా.. 20,902 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 2.66 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Related News

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Tirumala Darshan : తిరుమలలో సామాన్యులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటా…

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Big Stories

×