EPAPER

Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Today Gold Rate: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Today Gold Rate: ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే రిచ్ పీపుల్‌కి కూడా పిచ్చెక్కిపోతోంది. అవును, ఆల్ టైమ్ హైలో బంగారం ధర మంటలు రేపుతోంది. ఎన్నడూ లేనంత రికార్డ్ స్థాయిలో బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. కొన్ని నెలల కిందట గోడెక్కిన గోల్డ్.. రాను రానూ పరుగులు పెట్టింది. తాజాగా పెరిగిన బంగారం ధరతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.


పండగ పూట కూడా బంగారం కొనేందుకు జనం వణుకుతున్నారు. ఎన్నటికీ వన్నె తగ్గనిది.. ఆర్థిక కష్టాల్లో అక్కరకు వచ్చేది.. బంగారం. ఇతర వస్తువుల్లా తరిగిపోయేది కాదు.. ఒక్కసారి తవ్వితీశామా.. ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే పసిడికి అంత డిమాండ్‌. ఇప్పుడా పసిడి ధర గట్టిగానే పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 81 వేలు దాటగా.. రేపటి రోజుకు అది మళ్లీ పెరిగి అవకాశాలు గట్టిగానే ఉన్నాయి.

దానికి కారణం గత రెండు రోజుల నుంచి బంగారం వేలలో పెరగడమే. బంగారం ధరలు ఇలా విపరీతంగా పెరుగుతుండటంతో ఈ ప్రభావం ధన త్రయోదశి కొనుగోళ్లపై కూడా పడింది. ధనత్రయోదశి రోజు బంగారం దుకాణాలకు పసిడి ప్రియులు క్యూ కడతారు. కానీ, ఈసారి ధనత్రయోదశిని లైట్ తీసుకున్నారు.


ప్రస్తుతం ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 490 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 710 వరకు పెరిగింది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 340 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.

బెంగుళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 340 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.

Also Read: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 340 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 340 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560 ఉంది.

వైజాగ్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81, 340 వరకు పెరిగింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.74, 560  వద్ద ట్రేడింగ్ లో ఉంది.

 

 

 

 

Related News

ONE PLUS 13: అదిరిపోయే ఫీచర్స్‌తో వన్ ప్లస్ 13 వచ్చేసింది… ధర ఎంతంటే?

Credit Card New Rules Apply: క్రెడిట్ కార్డు వినియోగదారులకు అలర్ట్, నేటి నుంచి కోతలు, వాతలు.. తస్మాత్ జాగ్రత్త

Train advance reservation: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ రిజర్వేషన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Today Gold Rate: బంగారం బరువాయెనా..? తులం ఎంతుందో తెలుసా?

RPF Personal Praised: రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ.. భలే కంట్రోల్ చేశారే, హైదరాబాద్ ఆర్పీఎఫ్‌లకు నెటిజన్స్ సెల్యూట్

Today Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. వెలవెలబోతున్న గోల్డ్ షాప్స్..!

Big Stories

×