EPAPER

KCR: జెండా ఎత్తేసిన కేసీఆర్.. మహా యుద్ధంలో వెనక్కు తగ్గడానికి కారణమిదే!

KCR: జెండా ఎత్తేసిన కేసీఆర్.. మహా యుద్ధంలో వెనక్కు తగ్గడానికి కారణమిదే!

KCR: అంతన్నారు, ఇంతన్నారు. ఎంతో అన్నారు. చివరికి ఎటూ కాకుండా పోయారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేయాలనుకున్న రాజకీయం రివర్స్ అయిందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చెప్పి.. మహారాష్ట్రలో పుణ్యక్షేత్రాలు తిరిగి, కీలక నేతలను చేర్చుకుని.. అసలైన యుద్ధం వచ్చే సరికి జెండా ఎత్తేశారు. ఎందుకిలా జరిగింది? కేసీఆర్ వెనక్కు తగ్గడానికి కారణాలేంటి?


రాజకీయాల్లో ఎవరైనా, ఎన్నైనా కలలు కనొచ్చు. కానీ అవన్నీ నిజమవుతాయా? అంటే కానే కాదన్నది కేసీఆర్ చేసిన ఓ విఫల ప్రయోగం చూస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ వచ్చింది. రెండుసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. అయితే రెండోసారి గెలవగానే కేసీఆర్ చాలా ఊహించుకున్నారు. దేశ రాజకీయాలను మార్చేస్తాననుకున్నారు. ఎన్డీఏ, ఇండియా కూటములు కాదు.. ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నారు. మహారాష్ట్ర, ఏపీలో పోటీకి సై అన్నారు. మధ్యప్రదేశ్, ఒడిశాలోనూ పార్టీ విస్తరించాలనుకున్నారు. నేతల్ని చేర్చుకున్నారు. ఒక్కటేమిటి ఎన్నెన్నో ఊహించుకున్నారు. ఎంతో అనుకున్నారు. ఇవన్నీ జరగాలంటే పార్టీ పేరు మార్చాలనుకున్నారు. 2022 అక్టోబర్‌ 5న తెలంగాణ రాష్ట్రసమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి BRSగా మార్చేశారు.

భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పు కేసీఆర్ కు అస్సలు అచ్చి రాలేదు. ఎందుకంటే తెలంగాణతో పేగు బంధం తెంపేసుకున్నారని తెలంగాణ ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే గుండు సున్నా సీట్లు కట్టబెట్టారు. లెక్కలన్నీ మారిపోయాయి. రాజకీయ చాణక్యం అంటే కేసీఆర్ దే అన్న ప్రచారం గులాబీ దళంలో ఉండేది. కానీ పరిస్థితులు అన్నీ ఒకేలా ఉండవు కదా.. కథ మొత్తం మారిపోయి సొంత రాష్ట్రంలోనే పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యే పరిస్థితి వచ్చింది. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. సో ఇప్పుడు కేసీఆర్ టాపిక్ ఎందుకంటే … తాను ఎంతగానో ఊహించుకున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. అక్కడ షెడ్యూల్ వెలువడ్డా అసలు ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. ఎందుకంటే మహారాష్ట్రపై గతంలో చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలైన టైంలో చేతులెత్తేశారు. బ్యాడ్ టైంలో ప్రయోగాలు ఎందుకని సైలెంట్ గా ఉన్నారా లేక, మరేమైనా జరిగిందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.


Also Read: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్.. కేటీఆర్ ఏమన్నారంటే..?

మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలు తెలంగాణతో సరిహద్దుగా ఉన్నాయి. సో ఎలాగైనా తమ ఎఫెక్ట్ చూపొచ్చు అనుకున్నారు. సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామాలను టార్గెట్ చేశారు. సభలు సమావేశాలు నిర్వహించారు. సరిహద్దు సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను నాడు ఇంఛార్జ్ లుగా కూడా పెట్టారు. తెలంగాణలో అమలైన రైతుబంధు, రైతుబీమాతో అక్కడి రైతులు ఆకర్షితులైనట్లు, తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని డిమాండ్లు కూడా చేసినట్లు అప్పట్లో ప్రచారాలు చేసుకున్నారు. అయితే మహారాష్ట్రలో ఎంట్రీ కోసం గతంలో చాలా పెద్ద కథే నడిచింది. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో సమావేశాలను నిర్వహించారు గులాబీ బాస్. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను ఆదరిస్తే.. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మహారాష్ట్ర రైతులకూ వర్తింపజేస్తామన్నారు.

జాతీయ స్థాయిలో సత్తాచాటాలని మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, బిహార్ లో కేసీఆర్ పర్యటించి అక్కడ కూడా పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు. అయితే అన్నిటికంటే ఆయన మహారాష్ట్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. నాగపూర్, సోలాపూర్, నాందేడ్ ప్రాంతాలలో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు వందలాది కార్ల కాన్వాయ్ తో సోలాపూర్ జిల్లాలోని పండరీపూర్ విఠలేశ్వర్ మందిరాన్ని దర్శించుకున్నారు. అలాగే ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవానీ టెంపుల్ దర్శించుకున్నారు. తీర్థయాత్రలు చేశారు. బహిరంగ సభలు నిర్వహించుకున్నారు. మహారాష్ట్ర రైతుల పరిస్థితి ఇలా ఎందుకుందని ప్రశ్నించారు. తాము వస్తే కథ మారుస్తామన్నారు. కానీ అసలు టైం వచ్చే సరికి అడ్రస్ లేకుండా పోయారు. ఒకదశలో మహారాష్ట్ర నేతలు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా తమదారి తాము చూసుకున్నారు.

 

Related News

Tension in Nellimarla: నెల్లమర్లలో టెన్షన్.. టీడీపీ వర్సెస్ జనసేన

TDP VS Janasena: కూటమి నేతల మధ్య భగ్గుమంటున్న విభేదాలు

US Election 2024: ఫైనల్ ఫైట్ వీళ్లు గెలిస్తేనే.. యుద్ధాలకు చెక్..?

Telangana BJP Leaders: తెలంగాణ బీజేపీ నేతల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌..

Peddireddy Ramachandra Reddy: పెద్ది రెడ్డిపై వైసీపీ లీడర్ల తిరుగుబాటు.. షాక్ తప్పదా..?

Best Tourist Place: రణగొణ ధ్వనులుండవ్! కాలుష్యం ఆనవాళ్లుండవ్!.. ఈ బ్యూటీఫుల్ నేచర్ స్పాట్ ఎక్కడో తెలుసా?

Big Stories

×