Porsche car accident in Hyderabad: హైదరాబాద్‌లో పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ గోడను ఢీ కొట్టింది. వేగానికి కారు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు.
శుక్రవారం ఉదయం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి చెక్ పోస్టు వైపు పోర్షే కారు వస్తోంది. ఆ ప్రాంతం డౌన్‌గా ఉండడంతో కారు డ్రైవర్ మరింత వేగాన్ని పెంచాడు. చిన్న టర్నింగ్ తీసుకునే క్రమంలో నేరుగా వెళ్లి కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టి ఆగింది కారు.
ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారుకి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని, క్రేన్ సాయంతో వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.
ఇంతకీ కారు ఎవరిది? అన్నది ఆసక్తికరంగా మారింది. నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కారు ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. పోర్షే కారు బడాబాబులకు చెందినదిగా భావిస్తున్నారు పోలీసులు.
ALSO READ: హిజ్రాల వీరంగం.. వ్యాన్ ఆపి డ్రైవర్‌పై దాడి
ఇలాంటి కారును డ్రైవర్‌కి ఇవ్వరని, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, నెంబర్ ప్లేట్‌ను తీసుకొని వెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కారు ఎక్కడి నుంచి బయలు దేరింది? ఏయే ప్రాంతాల మీదుగా వచ్చింది? అనేదానిపై సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.
కొద్ది నెలల కిందట పూణెలో కూడా పోర్షే కారు ఘటన జరిగింది. మైనర్ బాలుడు అర్థరాత్రి డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలైయ్యాడు. ఆ యువకుడు రాజకీయ నేత కొడుకు కావడంతో ఆ కేసు నుంచి తప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు ఆ నేత అరెస్టయిన విషయం తెల్సిందే.
ఈ లెక్క హైదరాబాద్ పోర్షే కారు ఘటన వెనుక మైనర్ బాలుడు ఉన్నాడా? అన్న డౌట్‌ను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో తీగలాగితే ఎవరి డొంక కదులుతుందో చూడాలి.
గోడను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన పోర్షే కారు
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం. క్యాన్సర్ ఆసుపత్రి వైపు నుంచి అతివేగంగా వస్తూ అదుపు తప్పిన కారు. pic.twitter.com/vemmjicNID
— ChotaNews (@ChotaNewsTelugu) November 1, 2024