Brahmamudi serial today Episode: వేలం పాట అయిపోయాక అందరూ బయటకు వస్తారు. రుద్రాణి, అనామిక చివరికి కనకం కూడా కావ్యను తిడుతుంటారు. అనామిక ఏదో సాధించినట్టు బిల్డప్ ఇస్తుంది. ఇంతలో సామంత్ వచ్చి ఆక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదా? అని అడుగుతాడు. కాకపోవడం ఏంటి సామంత్ నువ్వు లేటుగా వచ్చావు. ఆక్షన్ అయిపోయింది. మనం గెలిచేశాం.. ఆ అరవింద్ కంపెనీని మనమే సొంతం చేసుకున్నాం అని అనామిక చెప్తుంది. అవునా ఎంతకు కొన్నావు అని సామంత్ అడగ్గానే 40 కోట్లకు మనం సొంతం చేసుకున్నాం. మరోసారి స్వరాజ్ కంపెనీని దెబ్బకొట్టాం అంటుంది అనామిక.
సామంత్ షాకింగ్ గా చూస్తూ.. 40 కోట్లా..? అంటూ మనం దెబ్బకొట్టడం కాదు.. మనమే దెబ్బతిన్నాం అనామిక.. అంటూ ఆ కంపెనీకి ఐదారు కోట్లే ఎక్కువా..? పైగా ఆ కంపెనీకి బ్యాంకులో 10 కోట్ల అప్పు ఉందట.. దీంతో మనం 35 కోట్లు లాస్ అనగానే అనామిక షాక్ అవుతుంది. ఇంతలో అరవింద్ వచ్చి కావ్యకు థాంక్స్ చెప్పి తనకు వచ్చిన 30 కోట్ల లాభంలో 15 కోట్లను చెక్ రాసి కావ్యకు ఇచ్చి వెళ్లిపోతాడు. కనకం హ్యాపీగా నవ్వుతూ వచ్చి ఇప్పుడే అర్థం అయింది. మనం కొనడానికి రాలేదా? అమ్మడానికి వచ్చామా..? అంటూ కావ్యతో అంటుంది. కాదమ్మా అమ్మి పెట్టడానికి వచ్చాము అంటుంది కావ్య.
అనామిక దగ్గరకు వెళ్లి కావ్య చెక్ చూపిస్తూ.. ఎవరి వేలితో ఎవరి కన్ను పొడుస్తావు అనామిక. నన్ను మోసం చేసి నీ కంపనీకి అవార్డు వచ్చేలా చేసుకున్నావు. ఇప్పుడు నా కంపెనీకి 15 కోట్లు లాభం వచ్చేలా చేసుకున్నాను అంటుంది. ఇంతలో కనకం ఇందాక రుద్రాణి ఏదో వాగింది. ఇప్పుడెందుకు గమ్ము రాసినట్టు నోరు మూతపడింది. అంటుంది. అనామిక, సామంత్, రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కావ్య హ్యాపీగా ఫీలవుతుంటే రాజ్ వచ్చి మళ్లీ మోసం చేసి గెలిచావా..? నీకు మీ అమ్మకు మోసం చేయడమే వచ్చు కదా? అంటాడు. దీంతో ఇదంతా మీరు నేర్పిన విద్యే అంటూ రాజ్ అంతకముందు చెప్పిన మాటలు గుర్తు చేస్తుంది.
ఇంతలో ఇందిరాదేవి కావ్యకు ఫోన్ చేసి అపర్ణ, సుభాష్‌ను పట్టించుకోవడం లేదని వాడు జ్వరంతో బాధపడుతున్నా చూస్తుందే కానీ ఏమీ పట్టించుకోవడం లేదని బాధపడుతుంది. దీంతో కావ్య నేను చూసుకుంటాను అమ్మమ్మ మీరేం బాధపడకండి అని ఫోన్ కట్ చేస్తుంది. అపర్ణను ఫోన్ చేసి తాను వేలం పాట ద్వారా కంపెనీకి లాభం తీసుకొచ్చిన విషయం చెప్పి వెంటనే మిమ్మల్ని కలవాలని చెప్తుంది. సరేనని అపర్ణ వెళ్తుంది. కావ్య దగ్గరకు వెళ్లిన అపర్ణ.. నిన్ను చూస్తుంటే ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది కావ్య. తాతయ్యకు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు అంటుంది. కానీ మీ వల్ల ఇంట్లో వాళ్లు చాలా బాధపడుతున్నారు అత్తయ్య. మీరు మామయ్యగారిని పట్టించుకోకపోవడం వల్ల అని కావ్య చెప్తుంది. దీంతో అపర్ణ కొన్ని తప్పుల్ని సరిద్దిలేము.. శిక్ష అనుభవించాల్సిందే అంటుంది.
మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. జీవితంలో ప్రతి మనిషికి రెండో అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి ఆయన్ని క్షమించి చూడండి అని కావ్య చెప్పగానే సరే నన్ను క్షమించమని అడుగుతున్నావు. నా కొడుకును నువ్వు క్షమించగలవా..? అని అపర్ణ అడగ్గానే నేను మీ కొడుకును ఎప్పుడో క్షమించాను అత్తయ్యా.. మీకు ఇంకా అర్థం కాలేదా..? మీరు ఆఫీసుకు రమ్మని అడిగినప్పుడే నేను ఆయన్ని క్షమించాను. ఆయన లోపం మూర్ఖత్వం. ఆయనలో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికి ఆయనతో కలిసి ప్రయాణించడానికే ఆఫీసుకు వెళ్తున్నాను. మరి మీరెందుకు మామయ్యను క్షమించలేరు. మీ అబ్బాయిలో మార్పు రావాలని మీరు ఇంత ప్రవర్తిస్తున్నారు. మీరు మారి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మీరు చూపిస్తేనే కదా ఆయనలో కూడా మార్పు వచ్చేది. మీరే ఆలోచించుకోండి అని కావ్య చెప్పగానే అపర్ణ ఆలోచనలో పడిపోతుంది.
జ్వరంతో బాధపడుతున్న సుభాష్ దగ్గుతూ హాల్లో కూర్చుని ఉంటాడు. ధాన్యలక్ష్మీ సూప్ తీసుకొచ్చి ఇస్తుంది. అది తాగకుండా అలాగే ఉండిపోతాడు సుభాష్. ఇందిర సూప్ తాగమని ఎంత చెప్పినా వినడు. ఇంతలో బయటి నుంచి వచ్చిన అపర్ణ.. ఏమంటున్నాడు అత్తయ్యా మీ అబ్బాయి అని అడుగుతుంది. ఏ అబ్బాయి అని ఇందిరాదేవి అడుగుతుంది. మా ఆయన సూప్ తాగడం లేదా.. అంటూ టేబుల్ మీద ఉన్న సూప్ తీసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే తాగండి అని ఇస్తుంది అపర్ణ. అపర్ణ మార్పుకు అందరూ షాక్ అవుతారు. రుద్రాణి మాత్రం ఇది కలా.. నిజమా ఒకసారి నన్ను గిల్లు అంటూ స్వప్నను అడగగానే స్వప్న గిల్లుతుంది.
రుద్రాణి కెవ్వుమని అరుస్తుంది. దీంతో కళ్లలలో నిప్పులు పోసుకున్నావా? రుద్రాణి అంతలా అరుస్తున్నావు అంటాడు ప్రకాష్. అపర్ణ టాబ్లెట్స్ మీకే తీసుకొచ్చానండి అంటూ సుబాష్‌కు ఇస్తూ ఇవి వేసుకుని రెస్ట్ తీసుకుందురు పదండి అంటూ రూంలోకి తీసుకెళ్తుంది అపర్ణ. తర్వాత రూంలో కూర్చుని తెగ టెన్షన్ పడుతున్న రాహుల్, రుద్రాణిల దగ్గరకు సాంగ్ ప్లే చేసుకుని వస్తుంది స్వప్న. పాట ఆపమని రుద్రాణి కోపంగా చెప్తుంది. దీంతో అంత ఇరిటేట్ అవ్వొద్దు అత్తా.. అసలు మీ ఈ ఇరిటేటింగ్ కు కారణ ఎవరో చెప్తే గుండే ఆగి చస్తావు అంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.