Nara lokesh in Atlanta: మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తితోపాటు ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం ఇచ్చారన్నారు. కానీ మాజీ సీఎం జగన్.. ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిని రోడ్డు కీడ్చారంటూ విమర్శలు గుర్పించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ అట్లాంటాలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్, జగన్ గురించి మాట్లాడాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో నోరు విప్పారాయన.
ఆయన గురించి మాట్లాడటానికి ఏమీ లేదని, ప్రజలే కుర్చీ మడతపెట్టారన్నారు. ఫలితాలు వచ్చినప్పుడు కాస్త భయమేసిందని, ఈ స్థాయిలో వస్తుందని తాము ఊహించలేదన్నారు మంత్రి లోకేష్. సీఎం బాబు అనుకుంటే.. లోపల వేయడానికి రెండు నిముషాలు చాలన్నారు.
ALSO READ: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆవేదన లేదా? ఎలాంటి తప్పు చేయని వ్యక్తి 52 రోజులు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కావాల్సింది రివేంజ్ కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ఆయన లక్ష్యమన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్నారు.
ప్రజలు తమపై బాధ్యత పెట్టారని, వారి ఆశలు వమ్ము చేయమన్నారు. పెట్టుబడులు రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కచ్చితంగా రెడ్ బుక్‌ని అమలు చేస్తామని చెప్పకనే చెప్పేశారు మంత్రి లోకేష్. ఈ క్రమంలో లెజెండ్ మూవీలో బాలకృష్ణ డైలాగ్‌ని గుర్తు చేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా ఉంటుందన్నారు.
అందరూ మిమ్మల్ని ఎన్.ఆర్.ఐ లు అంటారు, కానీ నేను మాత్రం ఎప్పుడూ మిమ్మల్ని ఎం.ఆర్.ఐ లు అనే అనుకుంటా. ఎం.ఆర్.ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీ జోష్, ఎనర్జీ చూస్తుంటే నేను అట్లాంటాలో ఉన్నానా, అమలాపురంలో ఉన్నానా అనే డౌట్ వస్తోంది. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తారు.… pic.twitter.com/xSbAObnGa2
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024
అట్లాంటాలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్#NaraLokesh #AndhraPradesh pic.twitter.com/lKdFAjBgwM
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2024