Hijras Attacks: హిజ్రాలు రెచ్చిపోతున్నారా? తాము అడిగింది ఇవ్వకుంటే దాడులకు తెగబడుతున్నారా? ఇది కేవలం ఏ ప్రాంతానికి పరిమితం కాలేదా? తెలంగాణలో హిజ్రాల హంగామా మరింత ఎక్కువగా ఉందా? అవుననే అంటున్నారు బాధితులు. అసలేం జరుగుతోంది.
హిజ్రాలు ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు, తెల్లవారు జామున వీరి హంగామా అంతా ఇంతా కాదు. లేటెస్ట్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో దీపావళి రోజు రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. ఏకంగా డజను మంది హిజ్రాలు డీసీఎం వ్యాన్ డ్రైవర్‌పై ఆపి దాడి చేశారు.
డ్రైవర్ క్యాబిన్ ఎక్కిమరీ వాహనం తాళాలు తీసుకునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకోలేక సైలెంట్ అయిపోయాడు డ్రైవర్. ఇదే అదునుగా భావించి రెచ్చిపోయారు హిజ్రాలు. మద్యం మత్తులో వాహనదారులను ఆపి పైసా వసూల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వనివారిపై పైన కనిపించిన విధంగా దాడులకు తెగబడుతున్నారు.
మధిర పట్టణంలో జరుగుతున్న ఈ ఘటనను చూస్తూ సామాన్యులు సైలెంట్ అయిపోయారు. వారి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. అటువైపుగా వస్తున్న కొంతమంది మీడియా మిత్రులు ఈ తతంగాన్ని బంధించారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ALSO READ: : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్.. కేటీఆర్ ఏమన్నారంటే..?
ఇక హైదరాబాద్ సిటీ విషయానికొద్దాం. కొన్ని ప్రాంతాల్లో హిజ్రాల హంగామా అంతాఇంతా కాదు. గృహా ప్రవేశం, బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, షాపుల ఓపెనింగ్ అయితే వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. అంత ఇవ్వలేమంటే తన గ్యాంగులను రప్పించి నానా రభస చేస్తున్నారు.
బండ్లగూడ జాగీర్, గండిపేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లో అయితే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు వాహనాలపై చక్కర్లు కొడతారు. గృహ ప్రవేశం లాంటి హడావుడి జరిగితే వెంటనే టీమంతా వచ్చి వాలిపోతారు. వీరి వేధింపుల తట్టుకోలేక గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
ఆయా ప్రాంతాల్లో హంగామా చేస్తున్న హిజ్రాలు లోకల్ వారు కాదని, నార్త్ఇండియా నుంచి వచ్చారని అంటున్నారు. అందుకే చిన్నపిల్లలు బర్త్ డే పార్టీ చేసుకోవాలని భయపడిపోతున్నారు. ఈ తతంగాన్ని ఆపకుంటే మునుముందు కష్టమని అంటున్నారు కొంతమంది బాధితులు.
మధిరలో హిజ్రాల వీరంగం…
మధిర పట్టణం లో రాత్రి ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేస్తున్న హిజ్రాలు. డీసీఎం వ్యాన్ అపి క్యాబిన్ లోకి ఎక్కి డ్రైవరను కొడుతూ, వ్యాన్ తాళాలు లాక్కున హిజ్రాలు, మద్యం మత్తులో వాహన దారులను అపి పైసల్ వసూల్ చేస్తూ, పైసల్ ఇవ్వని వారిపై ఇలా పదుల సంఖ్యలో కూడి ,దాడి… pic.twitter.com/pHfnc31Rl4
— ChotaNews (@ChotaNewsTelugu) November 1, 2024