Dulquar Salman: ప్రముఖ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammutti)వారసుడిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్(Dulquar Salman). మాలీవుడ్ లో యాక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తెలుగులో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక్కడ సోలో హీరోగా తెలుగులో నేరుగా చేసిన రెండవ చిత్రం లక్కీ భాస్కర్ (Lucky Bhaskar). దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ కాలేజీ డేస్ లో భవిష్యత్తుపై తన ఆలోచనలు ఎలా ఉండేవో చెప్పుకొచ్చారు.
ఆ భయంతోనే డైరెక్టర్ అవుదామనుకున్నా..
లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable S-4) రెండవ ఎపిసోడ్ కి హాజరయ్యారు. ఇక్కడ దుల్కర్ సల్మాన్ తో పాటు మీనాక్షి చౌదరి(Meenakshi Choudhary), నిర్మాత నాగ వంశీ (Naga Vamsi), డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) కూడా వచ్చి బాలయ్యతో సందడి చేశారు. ఈ షోలో లక్కీ భాస్కర్ టీమ్ అంతా కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..”అసలు నేను సినిమా రంగానికి వద్దామనుకోలేదు. అయితే నేను చదివే సమయంలో అసలు ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేని నా స్నేహితులు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో నా స్నేహితులు కూడా నన్ను సినీ రంగంలోకి రావాలని బ్రతిమలాడారు. కానీ నేను నటుడిని అయితే మా నాన్న మమ్ముట్టి తో కంపేర్ చేస్తారనే భయంతో డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే నటన అంటే కూడా నాకు చాలా భయం. కానీ చివరికి ఆ నటనలోకే రావడంతో ఒక్కొక్కసారి నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను అంటూ తెలిపారు దుల్కర్ సల్మాన్.
యాక్టింగ్ లో మెగా హీరోలే నా క్లాస్మేట్స్..
అలాగే యాక్టింగ్ స్కూల్లో ఎవరెవరితో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నారు అనే విషయాన్ని కూడా ఆయన తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ..” ముంబైలో బారీజాన్ యాక్టింగ్ స్కూల్లో నేను నటన నేర్చుకున్నాను. అప్పుడు మెగా హీరోలు సాయి ధరంతేజ్ (Sai Dharam Tej), వరుణ్ తేజ్ (Varun Tej) నా క్లాస్మేట్స్. వీరిద్దరితో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు అంటూ తెలిపారు దుల్కర్ సల్మాన్.
దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ ప్రయాణం..
మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ,ఆ తర్వాత హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వంలో సీతారామం (Sita Ramam) సినిమా చేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , ఈ సినిమాతో కూడా విజయం అందుకున్నారు ఏది ఏమైనా ఈయనను తెలుగు ప్రేక్షకులు భారీగా ఓన్ చేసుకున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. లక్కీ భాస్కర్ మొదటి రోజు రూ.100 కోట్ల కలెక్షన్లు దాటితే కచ్చితంగా నిర్మాత ఫోటో తన ఇంట్లో పెట్టుకుంటానని చెప్పారు. మరి ఈరోజు రూ.100 కోట్లు రాబట్టిందా అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.