EPAPER

US – Russia : 19 భారతీయ సంస్థలు, ఇద్దరు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు.. కారణాలేంటంటే.?

US – Russia : 19 భారతీయ సంస్థలు, ఇద్దరు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు.. కారణాలేంటంటే.?

US – Russia : రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేస్తున్నారని ఆరోపిస్తూ భారత్ కు చెందిన 19 ప్రైవేట్ సంస్థలు, ఇద్దరు భారత పౌరులపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా పౌరసత్వం కలిగిన సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారతీయుల పాత్ర ఉందంటూ అమెరికా ఆరోపణలతో భారత్‌ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయి. సరిగా ఈ సమయంలో అమెరికా తీసుకున్న ప్రస్తుత చర్య ఎలాంటి దౌత్య పరిణామాలకు దారి తీస్తోందననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


రెండేళ్లుగా రష్యా – ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో తలపడుతున్నాయి. అమెరికా సహా ఇతర పాశ్చాత దేశాలు ఉక్రెయిన్ తరఫున నిలబడి.. ఆయుధాలు సరఫరా చేస్తున్నాయి. దీంతో రష్యాకు సహాయం చేడయంతో పాటు, వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు సంస్థలపై పాశ్చాత్య దేశాలు అనేక రకాలుగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా.. వివిధ దేశాలకు చెందిన దాదాపు 4 వందల సంస్థలు, వ్యక్తుల పేర్లతో ఆమెరికా ఆంక్షల జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్ కు చెందిన 19 ప్రైవేట్ సంస్థలు, ఇద్దరు భారతీయులు ఉన్నారు.

ఉక్రెయిన్‌ ను ఆక్రమించుకునేందుకు రష్యా చట్టవిరుద్ధంగా ప్రయత్నిస్తోందన్న అమెరికా.. వివిధ దేశాల నుంచి రష్యాకు అందుతున్న సాయాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 120 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించగా.. అమెరికా ట్రెజరీ విభాగం 270, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ 40 పేర్లతో జాబితాను విడుదల చేశాయి. ఇందులోని వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించింది.


భారత్ నుంచి ఆంక్షలకు గురైన వారిలో వివేక్ కుమార్ మిశ్రా, సుధీర్ కుమార్ లు ఉన్నారు. వీరు దిల్లీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్ కంపెనీ.. అసెండ్ ఏవియేషన్ ఇండియాకు డైరెక్టర్లు. వీరు అమెరికా నుంటి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో పాటు CHPL వస్తువుల్ని రష్యాకు పంపిస్తున్నారని ఆమెరికా ఆరోపించింది. భారత్ తో పాటు.. అమెరికా ఆంక్షలు విధించిన సంస్థల్లో చైనా, మలేషియా, థాయ్‌లాండ్, టర్కీ, యూఏఈ లతో పాటు పలు దేశాల సంస్థలు ఉన్నాయి. ప్రస్తుత ఆంక్షల ద్వారా రష్యా రక్షణ దళాలు, పారిశ్రమలు ఎలాంటి విడిభాగాలు, సాంకేతిక వస్తువులు అందకూడదని అమెరికా భావిస్తోంది.

రష్యాకు ఎగుమతి అవుతున్న కామన్ హై ప్రయారిటీ లిస్ట్ (CHPL)లో మైక్రోఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ఐటెమ్‌లు (CNC) ఉన్నట్లు యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ కింగ్‌డమ్‌(UK), జపాన్ తో పాటు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ (BIS) గుర్తించాయి. వీటిని వివిధ దేశాల నుంచి కొనుగోలు చేస్తున్న రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధంలో వాటిని వినియోగిస్తున్నట్లు అమెరికా గుర్తించింది. ఈ కారణంగా.. అన్ని రకాలుగా రష్యాను బలహీన పరిచేందుకు ఉక్రెయిన్ మద్ధతున్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలనేది వాటి ఉద్దేశ్యం. ప్రస్తుత ఆంక్షల కారణంగా.. ఆయా సంస్థలు, వ్యక్తుల నుంచి వివిధ వస్తువుల సరఫరా ఆగిపోతే.. రష్యా పారిశ్రామిక, సైనిక కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని అమెరికా భావిస్తోంది.

Also Read :‘అర్బన్ నక్సల్స్‌తో జాగ్రత్త’.. ప్రతిపక్షాలపై మండిపడిన ప్రధాని మోడీ

ఇప్పుడే కాదు.. గతంలోనూ అమెరికా కొన్ని భారత సంస్థలపై ఆంక్షల్ని విధించింది. నవంబర్ 2023లో Si2 మైక్రోసిస్టమ్స్, అమెరికాకు చెందిన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను అవసరమైన లైసెన్స్ లేకుండా రష్యాకు సరఫరా చేస్తున్నారంటూ భారత సంస్థల్ని నిషేధిత జాబితాలో చేర్చింది. అయితే.. ఆమెరికా ప్రస్తుత అంక్షలు గతానికి భిన్నమైనవని.. అమెరికా చట్ట సభ సభ్యులు ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ – అమెరికా ప్రయోజనాలు కాకుండా.. మూడో దేశానికి సంబంధించిన వ్యవహారంలో ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారని అన్నారు.

Related News

Modi National Unity Day: ‘అర్బన్ నక్సల్స్‌తో జాగ్రత్త’.. ప్రతిపక్షాలపై మండిపడిన ప్రధాని మోడీ

Arvind Kejriwal: దీపావళికి టపాసులు పేల్చకండి: అరవింద్ కేజ్రివాల్

Army Use AI Jammu Kashmir: ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం.. అఖ్‌నూర్ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందంటే?..

Railway Luggage Fine: ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన

Actor Darshan Bail : కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్.. ఆపరేషన్ కోసం అనుమతించిన హైకోర్టు

India – China boarder issue : సరిహద్దులో చైనా స్నేహ హస్తం.. డ్రాగన్ కుయుక్తుల్ని నమ్మొచ్చా..?

×