BB Telugu 8: తెలుగు బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 9వ వారానికి గానూ ఐదుగురు నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఓటింగ్ ముగియడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా.. ఈ ఓటింగ్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుని, అటు కంటెస్టెంట్ల అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ఆ తర్వాత ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక బెజవాడ బేబక్క మొదటివారం ఎలిమినేట్ అవ్వగా.. రెండవ వారం శేఖర్ బాష ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగమణికంఠ, మహబూబ్ ఇలా వరుసగా ఎలిమినేట్ అయ్యారు.
మిగిలిన ఏడు మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో పాటు మరో ఆరు మంది హౌస్ మేట్స్ కలిపి మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో కొనసాగుతున్నారు. వీరిలో తొమ్మిదో వారానికి గాను యష్మీ, హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చేసారు. అయితే వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఐదు మంది కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో అభిమానులు సైతం ఉత్కంఠ గా ఎదురు చేస్తున్నారు. ఇకపోతే ఓటింగ్ సరళి ఇప్పుడు రోజు రోజుకి మారిపోతున్న నేపథ్యంలో నిన్న డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ ఈరోజు ఒక స్థానం మెరుగుపరుచుకున్నారు. ఇక సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కాస్త డేంజర్ జోన్ లోకి వచ్చారు.
ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ ను బట్టి చూస్తే యష్మి గౌడ టాప్ లో కొనసాగుతూ ఉండగా.. ఈమె ఏకంగా 38% ఓటింగ్ నమోదు చేసుకుందని తెలుస్తోంది. యష్మీ గౌడ మొదటి రోజు నుంచి హౌస్ లో ఉన్న నేపథ్యంలో ఈమెకు ఈ అంశం బాగా కలిసి వచ్చేలా కనిపిస్తోంది. మిగతా నలుగురు కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలు కావడంతో వీరు ఆల్రెడీ గేమ్ చూసి వచ్చారని నెగిటివ్ ఒపీనియన్ కూడా ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ కారణం వల్ల ఈ వారం ఈమెకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. ఇక రెండవ స్థానంలో గౌతమ్, మూడవ స్థానంలో టేస్టీ తేజ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తన భారీ శరీరం కారణంగా ఫిజికల్ టాస్క్ లలో ప్రభావం చూపడం లేదు అనే కారణంతోనే ఈయన ఎక్కువగా నామినేట్ అయ్యారు అని చెప్పవచ్చు. ఈయనకు ఈ అంశం బాగా కలిసి వచ్చేలా ఉంది. ఇక చివరి రెండు స్థానాలలో అనగా నాలుగవ స్థానంలో నయని పావని, ఐదవ స్థానంలో హరితేజ ఉన్నారు. ఒకరోజు వ్యవధి తేడాలో హరితేజ ఒక స్థానం మెరుగుపరుచుకొని నాలుగవ స్థానంలోకి రాగా.. ఇప్పుడు డేంజర్ జోన్ లోకి పావని వెళ్ళిపోయింది. అయితే వీరిద్దరి మధ్య అయిదు శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. మరి ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.