EPAPER

Spirit: పండగపూట ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వాటిని మొదలెట్టేశారు

Spirit: పండగపూట ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వాటిని మొదలెట్టేశారు

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో స్పిరిట్ ఒకటి. అనిమల్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పడెప్పుడు  ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందా ని వెయ్యి కళ్లతో చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా  కనిపించనున్నాడు. సందీప్ సినిమాలు ఎంత వైల్డ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఇక  డార్లింగ్ కటౌట్ కి సందీప్ రెడ్డి కథ తోడైతే.. బాక్సాఫీస్ ను కాపాడడం ఎవరి వలన కాదు. సందీప్ ఎప్పుడు బయటకనిపించినా..  ఈవెంట్ లో కనిపించినా స్పిరిట్ అప్డేట్ ఇవ్వమని అడగడమే. నేడు దివాళీ పర్వదినాన.. ఫ్యాన్స్ అడగకముందే ఒక గుడ్ న్యూస్ ను తెలిపారు. అదేంటంటే.. స్పిరిట్ మ్యూజిక్ పనులను మొదలుపెట్టినట్లు ఒక  వీడియో ద్వారా తెలిపారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

OTT Movies : అమావాస్య రోజు అర్ధరాత్రి ఆ ఇంటిలోకి వెళ్తే మాయం.. దిమ్మతిరిగే ట్విస్టులు.. 


ఇక  ఈ వీడియోలో  హర్షవర్ధన్ , సందీప్ ట్యూన్స్ వింటున్నట్లు కనిపిస్తుంది. సందీప్ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాడంటే..  స్పిరిట్ మ్యూజిక్ గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేనట్టే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడిన మాటలు సెన్సేషన్ గా మారాయి. ప్రభాస్ మొదటిసారి పోలీస్ డ్రెస్ లో కనిపించనున్నాడు.. ఇదొక ప్రత్యేకమైన కథ.. మ్యూజిక్ చాలా బావుంటుంది అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇప్పుడు ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ మరింత హైప్ ను క్రియేట్ చేశాయి.  ఇక ఈ చిత్రంలో కరీనా కపూర్- సైఫ్ ఆలీఖాన్  కీలక పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా నెగెటివ్ రోల్స్ లో అదరగొట్టనున్నారట.  ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Amaran: ‘అమరన్’ మూవీని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

Dulquer Salmaan: ఆ భయంతో డైరెక్టర్ అవుదామునుకున్న యంగ్ హీరో.. కట్ చేస్తే..!

Game Changer: లుంగీకట్టిన గ్లోబల్ స్టార్.. గేమ్ ఛేంజర్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

Sara Ali Khan: బాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ.. బీజేపీ లీడర్ కొడుకుతో సారా అలీ ఖాన్ ప్రేమాయణం

Vettaiyan Movie OTT: ఓటీటీలోకి వేట్టయాన్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

Dulquer Salmaan: సూపర్ స్టార్లు మాత్రమే అలాంటి పని చేయాలి, నేను చేస్తే ఒప్పుకోరు.. దుల్కర్ ఆసక్తికర కామెంట్స్

×