EPAPER

Sara Ali Khan: బాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ.. బీజేపీ లీడర్ కొడుకుతో సారా అలీ ఖాన్ ప్రేమాయణం

Sara Ali Khan: బాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ.. బీజేపీ లీడర్ కొడుకుతో సారా అలీ ఖాన్ ప్రేమాయణం

Sara Ali Khan: లవ్ స్టోరీల విషయంలో సౌత్ ఇండస్ట్రీతో పోలిస్తే బాలీవుడ్ కాస్త స్పీడ్‌గానే ఉంటుంది. అక్కడ నటీనటులు కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత వర్కవుట్ అవ్వదు అనిపిస్తే బ్రేకప్ చెప్పుకొని మరొకరితో డేటింగ్ ప్రారంభిస్తారు అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అలా అని అందరు నటీనటులు అలా ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న యంగ్ బ్యూటీల లవ్ స్టోరీలు చూస్తుంటే ఈ డేటింగ్ కాన్సెప్ట్ అంతా నిజమేనేమో అనిపిస్తోంది. ఇప్పటికే అనన్య పాండే, జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్లు తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడుతుంటే తాజాగా ఆ లిస్ట్‌లోకి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) కూడా యాడ్ అయ్యింది.


అడ్డంగా దొరికిపోయింది

బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సారా అలీ ఖాన్. కమర్షియల్ సినిమా కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న ‘కేదార్‌నాథ్’ సినిమాతో డెబ్యూ చేసింది. ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వగానే చాలామంది ఇతర నెపో కిడ్స్ లాగానే సారాపై కూడా తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. కొన్నాళ్ల క్రితం క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాజాగా కేదార్‌నాథ్ ట్రిప్‌కు వెళ్లిన సారా.. అక్కడ తన బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయింది. తన బాయ్‌ఫ్రెండ్‌కు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం విశేషం.


Also Read: స్టార్ డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో నటి.. పెళ్లి కూడా..!

ఫోటోలు వైరల్

సారా అలీ ఖాన్‌తో పాటు కేదార్‌నాథ్ ట్రిప్‌కు వెళ్లిన వ్యక్తి పేరు అర్జున్ ప్రతాప్ బజ్వా. తను ముందుగా ఒక మోడల్.. ఇప్పుడు పొలిటీషియన్‌గా మారిపోయాడు. ఇటీవల తాను కేదార్‌నాథ్ వెళ్లానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది సారా. అదే సమయంలో అర్జున్ కూడా తాను కేదార్‌నాథ్‌లో ఉన్నట్టు ఫోటోలు అప్లోడ్ చేశాడు. పైగా అక్కడ వీరిద్దరిని కలిసి చూసినవారు కూడా కొన్ని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సారా లవ్ మ్యాటర్ వైరల్ అయ్యింది. ఇప్పటివరకు అర్జున్, సారా కలిసున్నారనే విషయం బయటికి రాలేదు. కానీ ఈ ఫోటోలతో వారు తెలియకుండానే ఈ విషయాన్ని బయటపెట్టారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

పంజాబీ కుర్రాడు

అర్జున్ ప్రతాప్ బజ్వా పంజాబ్‌కు చెందిన ఒక బీజేపీ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది. పంజాబ్‌లో బీజేపీకి వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న ఫతే జంగ్ సింగ్ బజ్వా కుమారుడే అర్జున్. తను మోడల్‌గా పలు షోస్‌లో పాల్గొన్నాడు. ఇక త్వరలోనే రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు సారా అలీ ఖాన్.. తన సినిమాలతో బిజీగా ఉంది. చివరిగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘మర్డర్ ముబారక్’లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తను అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెట్రో ఇన్ దినో’ షూటింగ్‌లో బిజీగా ఉంది. వచ్చే నెల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Related News

Amaran: ‘అమరన్’ మూవీని తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే..?

Dulquer Salmaan: ఆ భయంతో డైరెక్టర్ అవుదామునుకున్న యంగ్ హీరో.. కట్ చేస్తే..!

Spirit: పండగపూట ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వాటిని మొదలెట్టేశారు

Game Changer: లుంగీకట్టిన గ్లోబల్ స్టార్.. గేమ్ ఛేంజర్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

Vettaiyan Movie OTT: ఓటీటీలోకి వేట్టయాన్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

Dulquer Salmaan: సూపర్ స్టార్లు మాత్రమే అలాంటి పని చేయాలి, నేను చేస్తే ఒప్పుకోరు.. దుల్కర్ ఆసక్తికర కామెంట్స్

×