Coconut Oil For Face: చాలా మంది ముఖ చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తారు. మాయిశ్చరైజింగ్ లక్షణాలు, ఇతర పోషకాల కారణంగా, ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేయడం నిజంగా ప్రయోజనకరమా లేదా కొన్ని దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి కొబ్బరి నూనెను ఎవరు ఉపయోగించకూడదు ?
కొబ్బరి నూనెను చర్మ సంరక్షణలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె మాయిశ్చరైజింగ్ , అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కొబ్బరి నూనె వాడకం అనేది అందరికీ సరికాదు. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల కొబ్బరినూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నా, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.
కొబ్బరి నూనె యొక్క ప్రయోజనాలు:
మాయిశ్చరైజర్: కొబ్బరి నూనెలో సహజమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని తేమగా, మృదువుగా చేస్తుంది. ఇది పొడి చర్మం, తామర వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. యాంటీ ఏజింగ్ కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.
మేకప్ రిమూవర్ : కొబ్బరి నూనె మేకప్ సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
మచ్చలను తగ్గిస్తుంది : కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి .
కొబ్బరి నూనె వాడటం వల్ల కలిగే నష్టాలు:
మొటిమలు: కొంతమందికి, కొబ్బరి నూనె మొటిమలను పెంచుతుంది. ఎందుకంటే ఇది చర్మ రంధ్రాలను అడ్డుకునే కామెడోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.
జిడ్డు చర్మం: మీ చర్మం ఇప్పటికే జిడ్డుగా ఉన్నట్లయితే, కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల మరింత జిడ్డుగా మారుతుంది.
సన్బర్న్: కొబ్బరి నూనెలో SPF ఉండదు. కాబట్టి దీనిని సన్స్క్రీన్గా ఉపయోగించకూడదు.
అలర్జీ: కొందరికి కొబ్బరినూనె కూడా అలర్జీ కావచ్చు.
చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవడం సరైనదేనా.. కాదా ?
కొబ్బరి నూనె వాడకం చర్మం రకాన్ని బట్టి ఉంటుంది. మీ చర్మం జిడ్డుగా లేదా మోటిమలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ,ఉపయోగించకుండా ఉండండి. కానీ మీ చర్మం పొడిగా ఉంటే, మీరు దానిని ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Also Read: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్లతో మీ అందం రెట్టింపు
కొబ్బరి నూనెను ముఖానికి ఎలా అప్లై చేయాలి ?
క్లీనింగ్: ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టండి.
పరిమాణం : రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె తీసుకుని ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి.
రాత్రిపూట ఉపయోగించండి : నిద్రపోయే ముందు కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేయడం మంచిది. తద్వారా చర్మం నూనెను రాత్రంతా గ్రహిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.