Diwali 2024 BO Winner.. సంక్రాంతిని మొదలుకొని క్రిస్మస్ వరకు ఎన్నో తెలుగు సినిమాలు.. పండుగ సెలవలను క్యాష్ చేసుకోవడానికి తమ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 31న దీపావళి కావడంతో పలు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. మరి ఈ దీపావళి సందర్భంగా విడుదలైన చిత్రాలు ఏంటి..? వాటి ఫలితాలు ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
అమరన్:
2024 అక్టోబర్ 31వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో.. ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి నటించారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి , నిఖితా రెడ్డి ఈ సినిమాని తెలుగులో విడుదల చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద దివాలీ విజేతగా నిలిచింది. ఇక ఈ చిత్రానికి 2.75 రేటింగ్ ఇవ్వడం జరిగింది.
లక్కీ భాస్కర్ ..
ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) రెండవసారి నేరుగా తెలుగులో చేసిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా విడుదలయ్యింది. ఇకపోతే ఈరోజు అమావాస్య కావడంతో ఒకరోజు ముందుగానే అనగా నిన్ననే ఈ సినిమాను విడుదల చేశారు. మీనాక్షి చౌదరి, రాంకీ , మానస చౌదరి, హైపర్ ఆది, సూర్యా శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.2.5 రేటింగ్ తో హిట్ జాబితాలో చేరిపోయింది.
క..
కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య ఘోరక్ తో తాజాగా ఏడడుగులు వేశారు. ఆ తర్వాత ఆయన విడుదల చేసిన చిత్రం క. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలయ్యింది. ఇకపోతే 2.0/5.0 రేటింగ్ తో యావరేజ్ గా నిలిచింది ఈ చిత్రం.
బఘీర..
ప్రశాంత్ నీల్ నుంచీ వచ్చిన బఘీర మూవీ కూడా దీపావళి సందర్భంగా విడుదలైంది. హోం భలే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో మురళి ద్విపాత్రాభినయం చేయగా.. రుక్మిణి వసంత్ డాక్టర్ గా నటించారు. ఇకపోతే ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజిఎఫ్ చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అందుకే ప్రశాంత్ నీల్ నుంచి మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 1.5 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పవచ్చు. ఇలా దీపావళి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ చిత్రాలలో అమరన్ సినిమా విజేతగా నిలిచింది. మరి ఏ మేరకు ఏ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాబడతాయో చూడాలి మరి.