Sai Pallavi: సాధారణంగా హీరోలను చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులుఉన్నారు .. కథను బట్టి, డైరెక్టర్ ను బట్టి.. హైప్ ను బట్టి సినిమాలకు వెళ్లేవారు కూడా ఉన్నారు. కానీ, హీరోయిన్ ను చూసి సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారని తెలుసా.. ? ఆమె నటిస్తుంది అంటే కుటుంబాన్ని మొత్తం ధైర్యంగా సినిమాకు తీసుకెళ్లవచ్చు అనేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సావిత్రి సినిమాలకు ఇలా అనుకొనేవారట.
ఇక ఇప్పుడు సాయి పల్లవి సినిమాలకు ప్రేక్షకులు ఇలా అనుకుంటున్నారు. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. మొదటి సినిమాలో ఆమెను చూసిన అభిమానులు ముఖం నిండా మొటిమలుఉన్నాయి .. ఈమె హీరోయిన్ ఏంటి అని విమర్శించారు. తెలుగులో ఫిదా సినిమాతో అడుగుపెట్టిన సాయి పల్లవి.. ఇక్కడ కూడా మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెలను ఫిదా చేసింది.
Jai Hanuman: ‘జై హనుమాన్’ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్.. దీపావళి సందర్భంగా థీమ్ సాంగ్ విడుదల
గ్లామర్ ఇండస్ట్రీలో అసలు గ్లామర్ చూపించకుండా .. ఎలాంటి అందాల ఆరబోతకు తావు ఇవ్వకుండా .. కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ సూపర్ స్టార్ గా మారింది. కేవలం సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో మరింత అభిమానాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే.. ఎంత హైప్ ఉంటుందో.. సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే అంతే హైప్ ఉంటుంది. ఇక తాజాగా ఆమె నటించిన అమరన్ సినిమా నేడు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. ఇందులో ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది అని చెప్పడం కన్నా జీవించింది అని చెప్పాలి. అమరన్ సినిమాకు భారీ బుకింగ్స్ జరిగాయి. దానికి కారణం సాయి పల్లవి క్రేజ్ అని చెప్పుకొస్తున్నారు. స్టార్ హీరో శివ కార్తికేయన్ ఉన్నా కూడా.. అమ్మడి పేరే గట్టిగా వినిపిస్తుంది.
Raveena Ravi: స్టార్ డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో నటి.. పెళ్లి కూడా..!
ఇందు పాత్రలో ఆమె నటించిన తీరు ప్రేక్షకులను కంటనీరు పెట్టిస్తుంది. కాలేజ్ డేస్ లో ముకుంద్ తో ప్రేమ, ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. భర్త ఆర్మీకి వెళ్ళినప్పుడు కూతురును చూసుకొనే విధానం.. ఇలా ఎన్నో రూపాల్లో ఆమె కనిపించి మెప్పించింది. ఇక మంచి టాక్ అందుకోవడంతో పాటు దీపావళీ విన్నర్ గా అమరన్ నిలిచిందని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు అందుకుంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.