EPAPER

Bigg Boss 8 Telugu Promo: బీబీ ఇంటికి దారేదిలో చివరి ఛాలెంజ్.. ఇకపై ఫ్రెండ్‌షిప్స్ ఉండవు, తాడోపేడో తేల్చుకోవడమే!

Bigg Boss 8 Telugu Promo: బీబీ ఇంటికి దారేదిలో చివరి ఛాలెంజ్.. ఇకపై ఫ్రెండ్‌షిప్స్ ఉండవు, తాడోపేడో తేల్చుకోవడమే!

Bigg Boss 8 Telugu Latest Promo: ప్రస్తుతం బిగ్ బాస్ 8లో ఉన్న పాత, కొత్త కంటెస్టెంట్స్ అంతా కలిసి నాలుగు టీమ్స్‌గా విడిపోయి బీబీ ఇంటికి దారేది అనే ఆటను మొదలుపెట్టారు. ఇందులో సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే టాస్కులను పూర్తి చేస్తుండాలి. గెలిచిన వారు ముందుకెళ్తుంటే.. ఓడిపోయిన వారు మాత్రం మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పుకోవాల్సి ఉంటుంది. బీబీ ఇంటికి దారేది మొదలయినప్పటి నుండి హౌస్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఎవరి గేమ్ గురించి వారే, ఎవరి టీమ్ గురించి వారే ఆలోచించుకుంటున్నారు. ఇక ఈ ఆటలోని చివరి ఛాలెంజ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


తాడోపేడో ఛాలెంజ్

‘‘బిగ్ బాస్ ఇస్తున్న చివరి ఛాలెంజ్.. తాడోపేడో. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా వివిధ స్థలాల్లో ఉన్న చిన్న చిన్న ముక్కలను సేకరించి, దానితో తాడును తయారు చేసుకొని దాని సహాయంతో ఒకవైపు ఉన్న లక్కీ బాక్స్‌ను లాక్కోవడం’’ అంటూ ఈ టాస్క్ గురించి బిగ్ బాస్ వివరించడంతో ప్రోమో ప్రారంభమవుతుంది. ఇక ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం కోసం రెడ్ టీమ్ నుండి గౌతమ్, గ్రీన్ టీమ్ నుండి టేస్టీ తేజ, బ్లూ టీమ్ నుండి నిఖిల్, యెల్లో టీమ్ నుండి రోహిణి రంగంలోకి దిగారు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన తాళ్లను సేకరించడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు బయట నుండి పడే తాళ్లను కూడా వారు బాగానే కలెక్ట్ చేశారు.


Also Read: కిడ్స్ గా మారిపోయిన కంటెస్టెంట్స్.. సూపర్ పర్ఫామెన్స్..!

నిఖిల్ సాధించాడు

తాళ్లను కలెక్ట్ చేసే విషయంలో నలుగురి మధ్య గట్టి పోటీనే జరిగింది. ఆ తర్వాత వారు ఆ తాళ్లను కలిపి ఒక తాడుగా చేసి గార్డెన్ ఏరియా మధ్యలో ఉన్న బాక్స్‌ను లాగడం మొదలుపెట్టారు. ముందుగా నిఖిల్ విసిరిన తాడుకే బాక్స్ హుక్ తగిలింది. దీంతో ఆ లక్కీ బాక్స్‌ను తనవైపు లాక్కొని విన్నర్ అయ్యింది బ్లూ టీమ్. చివరి ఛాలెంజ్ కాబట్టి గెలిచిన బ్లూ టీమ్‌కు రెండు యెల్లో కార్డ్స్ లభించాయి. అందులో ఒక కార్డ్‌ను నబీల్ టీమ్‌కు, ఒక కార్డ్‌ను యష్మీ టీమ్‌కు ఇచ్చారు. దీంతో ఈ రెండు టీమ్స్ నుండి మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి ఎవరు తప్పుకుంటారు అనే డిస్కషన్ మొదలయ్యింది. మునుపటిలాగా ఈసారి ఎవరూ త్యాగం చేయడానికి సిద్ధంగా లేరని అర్థమయ్యింది.

నేను తప్పుకోను

ముందుగా యష్మీ టీమ్ నుండి ఎవరు మెగా చీఫ్ కంటెండర్ రేసు నుండి తప్పుకుంటారు అనే డిస్కషన్ మొదలయ్యింది. ‘‘నేనైతే వెళ్లాలని అనుకోవడం లేదు’’ అని ముందుగానే స్టేట్‌మెంట్ ఇచ్చింది యష్మీ. వెయ్యిశాతం ఈవారం తాను కూడా తప్పుకోనని చెప్పేసింది ప్రేరణ. ఇప్పుడు గేమ్‌లో ఉండడం తనకు కూడా ముఖ్యమే అని గౌతమ్ అన్నాడు. మరోవైపు గ్రీన్ టీమ్‌లో కూడా ఇదే డిస్కషన్ నడిచింది. విష్ణుప్రియాను తప్పుకోమని చెప్పగా.. ‘‘మీరు ముందుకు వెళ్లడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను తీసేయొద్దు అంటున్నాను’’ అని ఫీలయ్యింది. దీంతో ఈసారి మెగా చీఫ్ అవ్వడం కోసం గట్టి పోటీ జరగనుందని అర్థమవుతోంది.

Related News

BB Telugu 8: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే.. ఊహించని ఎలిమినేషన్..!

BB Telugu 8 Promo: కిడ్స్ గా మారిపోయిన కంటెస్టెంట్స్.. సూపర్ పర్ఫామెన్స్..!

Bigg Boss 8 Telugu: సంచాలకుడిగా పృథ్వి ఫెయిల్.. గంగవ్వపై భారీ ఎఫెక్ట్, సపోర్ట్ కోల్పోయిన యష్మీ టీమ్

Bigg Boss 8 Telugu: గౌతమ్, నిఖిల్ మధ్య నలిగిపోతున్న యష్మీ.. టీమ్స్‌లో విభేదాలు, చిన్న మాటలకే మనస్పర్థలు

BB Telugu 8 Hariteja : హరితేజ పై నెగిటివ్ మార్క్.. బయటకొస్తే పాప పరిస్థితి ఏంటో..?

Bigg Boss Telugu 8 Promo: స్లీపింగ్ రేస్ ఛాలెంజ్.. ఏడ్చేసిన నయని పావని..

×