Minister lokesh met Google cloud CEO: అమెరికా టూర్‌లో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. లేటెస్ట్‌గా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాస్‌తో భేటీ అయ్యారు. ఏపీ గురించి వివరించిన మంత్రి లోకేష్, ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకారం అందించాలని కోరారు.
ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఐదురోజుల కిందట అమెరికా వెళ్లిన ఆయన, మల్టీనేషనల్ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నారు. అక్కడికాల మాన ప్రకారం బుధవారం రాత్రి గూగుల్ క్యాంపన్‌కు వెళ్లారు మంత్రి నారా లోకేష్.
గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాస్‌తో మంత్రి భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు వస్తున్నాయి, చాలా కంపెనీలు అక్కడ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్‌కు ఆ ప్రాంతం అనుకూలంగా ఉంటుందన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలన్నారు. సహచర టీమ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నది గూగుల్ క్లౌడ్ ప్రతినిధుల మాట.
ALSO READ: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్
ఇండియాస్పోరా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని, అక్కడ పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు. డాటా సేవల రంగంలో పెట్టుబడులకు విశాఖలో అనుకూల వాతావరణం ఉందని, ఆ ప్రాంతం గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందన్న విషయాన్ని వివరించారు మంత్రి లోకేష్.
Visited the @Google campus in San Francisco, where I met with @googlecloud CEO, Mr Thomas Kurian. We discussed cloud infrastructure, with a focus on establishing data centres in Vizag. During my visit, I also highlighted GoAP's commitment to enhancing citizen services with… pic.twitter.com/xmXma0uJSl
— Lokesh Nara (@naralokesh) October 31, 2024