EPAPER

Face Glow Tips: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్‌లతో మీ అందం రెట్టింపు

Face Glow Tips: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్‌లతో మీ అందం రెట్టింపు

Face Glow Tips: మారుతున్న సీజన్ ప్రకారం చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే చర్మంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఫేస్ స్క్రబ్‌‌లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా మెరిసేలా చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ స్క్రబ్‌‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.


పెసర పిండి, పంచదార, తేనె ఓట్స్ వంటి వాటితో ఇంటిలో తయారు చేసిన ఫేస్ స్క్రబ్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. అంతే కాకుండా మృత కణాలను తొలగించి చర్మానికి తేమను అందిస్తాయి.పండుగలు, పంక్షన్ల సమయంలో కూడా ఈ స్క్రబ్‌లను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా, మృదువుగా ఉంటుంది. వీటిలో ఉండే సహజ మూలకాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా తేమను అందిస్తాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. మీరు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలిగే కొన్ని హోం మేడ్ ఫేస్ స్క్రబ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. శనగపిండి, పెరుగుతో స్క్రబ్:


శనగపిండి పెరుగును సమపాళ్లలో తీసుకుని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని శుభ్రంగా , తేమగా మార్చుతుంది. అంతే కాకుండా చర్మానికి పోషణను అందిస్తుంది.

2. చెక్కర, తేనెతో స్క్రబ్:
1 టేబుల్ స్పూన్ పంచదారలో 1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ వేసి పేస్ట్ తయారు చేసుకోండి. దీనిని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా చెక్కర చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. తేనె చర్మంలో తేమను నిలుపుతుంది.

3. నిమ్మరసం, చెక్కరతో స్క్రబ్:
1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఇందులోని నిమ్మరసం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చెక్కర మృత కణాలను తొలగిస్తుంది.

Also Read: జుట్టు విపరీతంగా రాలిపోతుందా ? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో !

4. ఓట్స్, పాలుతో స్క్రబ్:
ముందుగా రెండు స్పూన్ల ఓట్స్‌ను తీసుకుని గ్రైండ్ చేసి, అందులో తగినంత పాలు వేసి పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి. దీన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంలో మసాజ్ చేయాలి. తరువాత 15 నిమిషాలు ఉంచి కడిగేయాలి.ఈ స్క్రబ్ తేమను అందించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

5. కాఫీ, కొబ్బరి నూనెతో స్క్రబ్:
1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను 1 టీ స్పూన్ కాఫీ పౌడర్‌తో కలిపి పేస్ట్‌లా చేయండి. తరువాత దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత కడిగేయండి. ఈ స్క్రబ్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా తేమను అందిస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తూ, అందంగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tips For Eyelashes: ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయ్

Coconut Oil For Face: ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Haircare Tips: జుట్టు విపరీతంగా రాలిపోతుందా ? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో !

Karivepaku Rice: సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి

Coconut Milk: కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు మీ గుండె పదిలం

Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్యూల్స్‌తో ఇలా చేస్తే.. గ్లాసీ స్కిన్ మీ సొంతం

×