Pushpa 2: ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్లో వస్తున్న చిత్రం పుష్ప 2 (Pushpa 2). భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా దీపావళి సందర్భంగా ఒక పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ (Allu Arjun ), రష్మిక మందన్న (Rashmika mandanna) లుక్ అందరినీ ఆకట్టుకుంది. చివరికి అత్తింటి కోడలిగా వంటగదిలో శ్రీ వల్లీఉండగా.. పుష్పరాజ్ వెనకాలే కొంగుచాటు భర్తగా కనిపించి ఆశ్చర్యపరిచారు . ముఖ్యంగా ఈ సినిమా లో శ్రీవల్లి పుష్ప రాజ్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందని చెప్పవచ్చు. ఇక డిసెంబర్ ఐదవ తేదీన బిగ్ స్క్రీన్స్ లో కలుసుకుందాం అంటూ ఎక్స్ లో రష్మిక పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
పుష్ప -2 లో మెయిన్ విలన్..
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన చాలా ఘనంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ , గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇందులో ఫహద్ ఫాజిల్ , సునీల్, అనసూయల విలనిజం సినిమాకే హైలెట్ గా నిలవబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అనసూయ కోసం సుకుమార్ ప్రత్యేక పాత్ర..
ఒకరకంగా చెప్పాలి అంటే అనసూయ కోసం ప్రత్యేకమైన పాత్రను పుష్ప సినిమాలో సుకుమార్ డిజైన్ చేశారు.
దాక్షాయిణి పాత్రలో అనసూయ కూడా చాలా పవర్ ఫుల్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు సీక్వెల్ లో కూడా ఈమె మెయిన్ విలన్ అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే పుష్ప రాజ్ వర్సెస్ దాక్షాయిని అన్నట్టుగా కథ మారిపోతుంది అని సమాచారం. ఇకపోతే రంగస్థలం సినిమాలో ప్రకాష్ రాజ్ ను మెయిన్ విలన్ గా చివర్లో చూపించి, భారీ ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా దాక్షాయిని మెయిన్ విలన్ గా లాస్ట్ లో ట్విస్ట్
ఇస్తారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అనసూయ కెరియర్..
మరోవైపు అనసూయ విషయానికి వస్తే.. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా దాక్షాయినిగా పేరు మార్చుకోబోతున్నట్లు సమాచారం.
Pushpa Raj & Srivalli wish you and your family a very Happy Diwali 🫶
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024 ❤🔥#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @AAFilmsIndia… pic.twitter.com/fJ0pmQxk4j
— Rashmika Mandanna (@iamRashmika) October 31, 2024