EPAPER

Israel Hezbollah: ‘ఇజ్రాయెల్‌తో సంధికి మేము రెడీ.. కానీ’.. హిజ్బుల్లా కొత్త చీఫ్ ప్రకటన

Israel Hezbollah: ‘ఇజ్రాయెల్‌తో సంధికి మేము రెడీ.. కానీ’.. హిజ్బుల్లా కొత్త చీఫ్ ప్రకటన

Israel Hezbollah| శాంతి స్థాపన కోసం ఇజ్రాయల్‌తో తాము సంధికి సిద్ధమని లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా కొత్త నాయకుడు నయీమ్ ఖాసెం బుధవారం అక్టోబర్ 31న ప్రకటించాడు. అయితే సంధికి తమ షరతులు వర్తిస్తాయని పేర్కొన్నారు. లెబనాన్ లోని బాల్బెక్ నగరంలో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ గత కొన్ని రోజుల్లో దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఒక హిజ్బుల్లా సీనియర్ కమాండర్ చనిపోయాడని సమాచారం. ఈ క్రమంలో నయీమ్ ఖాసెం సంధి ప్రకటన చేయడం కీలకంగా మారింది.


లెబనాన్ ప్రధాన మంత్రి నజీబ్ మికాతీ కూడా యుద్ధంలో కాల్పుల విరమణ కోసం ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ 5న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, యుద్ధంలో సంధి కోసం అమెరికా దౌత్యాధికారులు ప్రయత్నిస్తున్నట్లు నజీబ్ మికాతీ తెలిపారు.

మరోవైపు హిజ్బుల్లా నాయకుడు నయీమ్ ఖాసెం తాజాగా చేసిన సంధి ప్రకటనలో కొన్ని షరతులు సూచించారు. ఇజ్రయెల్ ఎన్ని దాడులు చేసినా నెలల తరబడి ఆ దాడులను తట్టుకునే సామర్థ్యం హిజ్బుల్లాకు ఉందని.. కానీ ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధంలో చాలా కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకే సంధి కోసం ఇజ్రాయెల్ కూడా ముందుకు వస్తే.. తాము కాల్పుల విరమణకు సిద్ధమని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ యుద్ధం ఆపే దిశగా సరైన ప్రయత్నాలు చేయాలని, ఇరు వైపులూ ఆమోదయోగ్యంగా ఉండే షరుతులుంటేనే సంధి కుదురుతుందని వెల్లడించారు.


మరోవైపు ఇజ్రాయెల్ అధికారులు కూడా సంధి కోసం అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మంత్రులతో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హిజ్బుల్లాతో సంధి అంశంపై చర్చించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Also Read:  ‘ఎక్కువ కాలం బతకడు.. త్వరలోనే లేపేస్తాం’.. హిజ్బుల్లా కొత్త నాయకుడిపై ఇజ్రాయెల్ వ్యాఖ్యలు

ఇజ్రాయెల్ సరిహద్దుల నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు వైదొలగాలని .. వారి స్థానంలో లెబనాన్ సైనికులు ఉండాలని ఇజ్రాయెల్ కోరుతోంది. ఒకవేళ దాడి జరిగితే.. ఇజ్రాయెల్ తిరిగి దాడి చేస్తుందని షరతులు విధించింది.

ఇంకొకవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారులు ఇజ్రాయెల్ కు చేరుకొని గాజా, లెబనాన్ లో సమస్యలకు పరిష్కారం కోసం చర్చలు జరపాలని సూచించారు.

తాజాగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లోని బాల్బెక్ నగరంలో చేసిన దాడుల్లో మంగళవారం 19 మంది చనిపోయారు. హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలపై మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు తూర్పున ఉన్న మిలిటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఇప్పటివరకు లెబనాన్ లో జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో 1754 మంది లెబనాన్ పౌరలు చనిపోగా.. 37 మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు.

మరోవైపు హమాస్ తో సంధి కోసం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ చీఫ్ కతార్ బయలుదేరి వెళ్లారు. అక్కడ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులకు బదులు ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలుగా ఉన్నవారిని విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.

Related News

North Korea – US : ఉత్తర కొరియా ఖండాతర క్షిపణి ప్రయోగం.. అమెరికానే టార్గెట్ అంటున్న కిమ్ జోంగ్ ఉన్

Trump Garbage Truck: చెత్త ట్రక్కులో ట్రంప్.. బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్

No Diwali In Canada: భారతీయుల పట్ల వివక్ష.. కెనెడాలో దీపావళి వేడుకలు రద్దు

Spain flash floods : స్పెయిన్‌లో వరద బీభత్సం.. 95 మంది మృతి.. కొట్టుకుపోయిన కార్లు, ఇళ్లు..

Ichinono: ఆ జపాన్ విలేజ్‌లో మనుషుల కంటే బొమ్మలే ఎక్కువ.. ఏ వీధిలో చూసినా అవే కనిపిస్తాయ్, ఎందుకంటే?

Chinese Govt : ఆ టైమ్‌కి ‘కలిస్తే’ పిల్లలు పుడతారు.. దంపతులకు చైనా సూచనలు, డ్రాగన్ కంట్రీకి ఎంత కష్టమొచ్చిందో!

×