EPAPER

Karivepaku Rice: సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి

Karivepaku Rice: సింపుల్‌గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్, టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి
Karivepaku Rice: మిగిలిపోయిన అన్నంతో కరివేపాకు రైస్ చేశారంటే టేస్టీగా ఉంటుంది.  పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీలుగా ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము ఒక బెస్ట్ రెసిపీ ఇచ్చాము. కరివేపాకు రైస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే అన్నం మిగిలిపోయినప్పుడు కూడా దీన్ని సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు రైస్ సింపుల్‌గా పదినిమిషాల్లో ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.


కరివేపాకు రైస్‌కు కావలసిన పదార్థాలు
వండిన అన్నం – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
ఆవాలు – అర స్పూను
పచ్చిశనగపప్పు – ఒక స్పూను
ధనియాలు – ఒక స్పూను
కారం – ఒక స్పూను
పసుపు – అర స్పూను
కరివేపాకులు – ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు – మూడు
నువ్వులు – ఒక స్పూను
పల్లీలు – గుప్పెడు
మినప్పప్పు – ఒక స్పూను

Also Read: కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు మీ గుండె పదిలం

కరివేపాకు రైస్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. ఆ నూనె వేడెక్కాక వెల్లుల్లి రెబ్బలు వేయండి.
3. ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు, కరివేపాకులు, నువ్వులు వేసి వేయించుకోవాలి.
4. వీటన్నింటినీ మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయిని పెట్టి మరి కొంచెం నూనె వేయాలి.
6. అందులోనే పల్లీలు,  ఇంగువ వేసి వేయించాలి. గుప్పెడు కరివేపాకులను కూడా వేసి వేయించుకోవాలి.
7. అవి వేగాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
8. అలాగే ముందుగా మిక్సీ పట్టిన పొడిని కూడా దీనిపై చల్లి కలుపుకోవాలి.
9. అంతే టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయినట్టే.
10. పిల్లలకు ఇది ఎంతో నచ్చుతుంది. సింపుల్ గా లంచ్ బాక్స్ లో పెట్టి తీసుకెళ్ళిపోవచ్చు.
11. కరివేపాకు రైస్ ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. దీనికి జతగా రైతా, కర్రీ వంటివి అవసరం ఉండవు.


కరివేపాకులు మన ఆరోగ్యానికి చేసే ఇచ్చే ప్రయోజనాలు ఎన్నో కరివేపాకు. రైస్ తినడం వల్ల కరివేపాకులు ఉన్న పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి. కరివేపాకులు తినడం వల్ల చర్మ సమస్యలు రావు. అలాగే కొలెస్ట్రాల్ ఉన్నవారు కరేపాకులను తరచు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యాన్ని అందిస్తాయి. గుండె జబ్బులు బారిన పడిన వారు కూడా కరివేపాకులను తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. జుట్టును చర్మాన్ని మెరిపించే శక్తి కరివేపాకులకు ఉంది. కరివేపాకులను కూరల్లో వేసినా కూడా తీసి పడేసేవారు ఎక్కువమంది. నిజానికి కరివేపాకు తినడం వల్ల మీకే ఎన్నో లాభాలు ఉంటాయి. మీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు, విషాలు బయటికి పోతాయి. కరివేపాకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తిని రోగనిరోధక శక్తి అందిస్తుంది. కాబట్టి కరివేపాకులను తక్కువగా చూడకుండా తీసి పడేయకుండా కరివేపాకు రైస్, కరివేపాకు పచ్చడి రూపంలో తింటే ఎంతో మంచిది.

Related News

Tips For Eyelashes: ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయ్

Coconut Oil For Face: ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Face Glow Tips: ఫేస్ క్రీములు అవసరమే లేదు.. ఈ స్క్రబ్‌లతో మీ అందం రెట్టింపు

Haircare Tips: జుట్టు విపరీతంగా రాలిపోతుందా ? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో !

Coconut Milk: కొబ్బరి పాలను ఆహారంలో భాగం చేసుకుంటే చాలు మీ గుండె పదిలం

Vitamin E Capsule: విటమిన్ ఈ క్యాప్యూల్స్‌తో ఇలా చేస్తే.. గ్లాసీ స్కిన్ మీ సొంతం

×