SSMB 29 Movie Update.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గుంటూరు కారం (Guntur karam)సినిమా వరకు టాలీవుడ్ సినీ పరిశ్రమకే పరిమితమై.. ఇప్పుడు రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చాలా పగడ్బందీగా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. అటు మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా గడ్డం, జుట్టు కూడా పెంచారు. అంతేకాదు రాజమౌళి కూడా ఏ ఐ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం కెన్యాలో కూడా ఆయన పర్యటిస్తున్న ఫోటోలు కూడా షేర్ చేశారు.
మహేష్ ను సింహంతో పోల్చిన రాజమౌళి..
అక్కడ సరైన లొకేషన్ దొరికితే త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి తోడు రాజమౌళి కూడా సోషల్ మీడియాలో ఒక సింహం ఫోటోను షేర్ చేశారు. ఆ సింహం ఫోటోకి మహేష్ బాబును కూడా ట్యాగ్ చేశారు రాజమౌళి. దీంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ ను రాజమౌళి ఫైనల్ చేసే పనిలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి సినిమాలో దీపిక..
ఇటీవల ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్కి 2898AD. ఫ్యూచరిస్టిక్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమా తో హీరోయిన్ గా తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దీపికా పదుకొనే (Deepika Padukone) ను రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే రాజమౌళి కల్కి సినిమా ద్వారా ఇమేజ్ సొంతం చేసుకున్న దీపికాను ఈ సినిమాలో ఫైనల్ చేసేలాగా ఆలోచిస్తున్నారట. ఒకవేళ ఈమె కూడా ఇందులో నటిస్తే ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే ఆలోచన ఆయనలో కలిగిందని , అందుకే ఆమెను ఇందులో తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం . మరి ఇదే నిజమైతే తెలుగులో దీపికాకు వరుస అవకాశాలు తలుపు తడతాయి అనడంలో సందేహం లేదు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక ఇండోనేషియా నటి సిద్ధమైందని ఆమె సంతకాలు కూడా చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినిపిస్తోంది.
దీపిక సైన్ చేసేనా..?
ఇదిలా ఉండదా దీపిక పదుకొనే ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి సినిమాలలో బిజీ అవ్వాలని చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం రాజమౌళి దీపికను ఈ సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.