EPAPER

Allu Sirish: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా హీరో.. వధువు ఎవరంటే..?

Allu Sirish: పెళ్లి పీటలు ఎక్కబోతున్న మెగా హీరో.. వధువు ఎవరంటే..?

Allu Sirish.. ప్రస్తుత కాలంలో హీరోలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని బ్యాచిలర్ లైఫ్ ను వీడుతున్నారు. కానీ మరికొంతమంది నాలుగు పదుల వయసు దాటినా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు. అయితే ఇలాంటి జాబితాలో పేరు దక్కించుకున్న మెగా హీరో అల్లు శిరీష్ ఇప్పుడు పెళ్లికి సిద్ధం అవుతున్నారు.


అల్లు శిరీష్ సినిమాలు..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా హీరోగా పరిచయమైన ఈయన గౌరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఏబిసిడి, శ్రీరస్తు శుభమస్తు, ఒక్కక్షణం, ఊర్వశివో, రాక్షసివో వంటి సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవలే బడ్డీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.


క్లోజ్ ఫ్రెండ్ తో పెళ్లికి సిద్ధమైన అల్లు శిరీష్..

ముంబైలో నటన నేర్చుకునే సమయంలో తన క్లోజ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడ్డారట. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి, ఒప్పించి ఇప్పుడు పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అల్లు శిరీష్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే త్వరలో అల్లు – మెగా కుటుంబాలలో పెళ్లి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

అల్లు హీరో పెళ్లి.. మెగా కుటుంబాన్ని కలిపేనా..?

ఈ విషయం తెలిసి అల్లు – మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ బహిరంగంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలకక పోవడం, అటు ప్రత్యక్షంగా వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేయడంతో అల్లు , మెగా అభిమానుల మధ్య వార్ నడిచింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ పుష్ప -2 సినిమాను ఉద్దేశించి కామెంట్స్ చేయడం, మరొకవైపు మెగా హీరోలంతా కూడా అల్లు అర్జున్ ను దూరం పెట్టినట్టు ప్రవర్తించడంతో అందరిలో కొత్త అనుమానాలు కలిగాయి. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇరువురు కుటుంబాలు ఇకనైనా కలుసుకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అన్నలా క్రేజ్ తెచ్చుకోలేకపోయిన అల్లు శిరీష్..

ఇక అల్లు శిరీష్ తన అన్న అల్లు అర్జున్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకోలేదని చెప్పవచ్చు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపును అందివ్వగా.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ పుష్ప -2 కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 ఇప్పటికే రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ రేంజ్ భారీగా పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.

Related News

Jai Hanuman: ‘జై హనుమాన్’ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్.. దీపావళి సందర్భంగా థీమ్ సాంగ్ విడుదల

Raveena Ravi: స్టార్ డైరెక్టర్ తో పీకల్లోతు ప్రేమలో నటి.. పెళ్లి కూడా..!

Amaran Movie Review : ‘అమరన్’ మూవీ రివ్యూ

Pushpa 2 Diwali Wishes: దీపావళికి బ్లాస్ట్ అయ్యేలా.. పుష్ప 2 అప్డేట్..!

SSMB 29 Movie Update: మహేష్ మూవీలో ఈ హీరోయిన్ కూడా.. జక్కన్న ప్లానేనా..?

Dulquar Salman: అదే నిజమైతే ఈ హీరో ఇంట్లో తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ ఫోటో ఫిక్స్..!

×