Dulquar Salman: మలయాళ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి (Mammutti ) అక్కడ భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. సౌత్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈయన వారసుడు దుల్కర్ సల్మాన్ (Dulquar Salman) కూడా అటు మాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకుని , ఇప్పుడు తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు ఆడియన్స్ ఈయనను ఓన్ చేసుకుంటున్నారు. కీర్తి సురేష్ (Keerthi Suresh) లీడ్ రోల్ పోషించిన మహానటి (Mahanati) చిత్రంలో జెమినీ గణేషన్ (Jemini Ganeshan) క్యారెక్టర్ పోషించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు దుల్కర్ సల్మాన్.
సీతారామం సినిమాతో తెలుగులో హీరోగా గుర్తింపు..
హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వములో సీతారామం అనే చిత్రాన్ని నేరుగా తెలుగులో చేసిన దుల్కర్ సల్మాన్, ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, అంతకుమించి అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ – దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజెంట్స్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ కి తెలుగులో మార్కెట్ బాగా పెరగడంతో తాజాగా లక్కీ భాస్కర్ (Lucky Bhaskar) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 31వ తేదీన అనగా ఈరోజు విడుదల కావాల్సి ఉండగా.. దీపావళి అమావాస్య కాబట్టి ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం ప్రీమియర్ షో వేశారు.
లక్కీ భాస్కర్ రూ.100 కోట్లు రాబడితే, నిర్మాత ఫోటో మా ఇంట్లో పెడతా..
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు తన సినిమా ద్వారా రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం ఒక కళ అని, అది ఈ సినిమాతో గనుక జరిగితే ఖచ్చితంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఫోటోని తన ఇంట్లో పెట్టుకుంటానంటూ ఓపెన్ గా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
13 ఏళ్ల కల.. ఈ సినిమా నెరవేరుస్తుందా..?
ప్రమోషన్స్ లో భాగంగా ముందుగా నిర్మాత నాగవంశీ(Naga Vamsi)మాట్లాడుతూ..”లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజే రూ.100కోట్లు కలెక్ట్ చేయొచ్చు” అన్నారు. అయితే ఈ మాటలపై హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ” నా 13 ఏళ్ల కెరియర్లో ఇప్పటివరకు దాదాపు నేను 40 చిత్రాలు చేశాను. అయితే రూ.100 కోట్ల కలెక్షన్స్ అనేది ఇప్పటికీ కూడా నాకు ఒక కలగానే ఉంది. నిజంగా లక్కీ భాస్కర్ సినిమా మొదటి రోజు కనుక రూ.100 కోట్లు వసూలు చేసింది అంటే కచ్చితంగా నిర్మాత నాగ వంశీ ఫోటోను ఫ్రేమ్ చేయించి మరీ మా ఇంట్లో పెట్టుకుంటాను. ఈ సినిమా ఇంత కలెక్షన్స్ రాబడితే నాకంటే ఎక్కువ సంతోషించే వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ ఉండరు” అంటూ తెలిపారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మాధ్యమాలలో చాలా వైరల్ గా మారుతున్నాయి. దుల్కర్ సల్మాన్ 13 ఏళ్ల కల ఈ సినిమాతో నెరవేరాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.