EPAPER

TTD Sarva darshanam: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మీరే వడ్డించే అవకాశం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

TTD Sarva darshanam: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మీరే వడ్డించే అవకాశం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

TTD Sarva darshanam: తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విదిత‌మే.


ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకై రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ ( టీ, కాఫీలు, పాలు కలిపి) చేస్తోంది.

Also Read: Diwali 2024: దీపావళి రోజు దీపాలు వెలిగించేటప్పుడు తప్పక పాటించాల్సిన 7 నియమాలు ఇవే

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 55,219 మంది భక్తులు దర్శించుకోగా.. 16211 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.37 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Related News

Minister lokesh met Google cloud CEO: అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..

Arcelor Mittal-Japan’s Nippon: ఏపీలో భారీ పెట్టుబడి, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ కంపెనీ ప్లాంట్

Janasena In TTD: టీటీడీ బోర్డులో జనసేన, బీజేపీ.. ముగ్గురు చొప్పున ఛాన్స్

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..

Mega DSC: గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్

Sharmila on Jagan: ఈ శతాబ్దపు జోక్.. జగన్ బెయిల్ రద్దు అంశంపై స్పందించిన షర్మిల

×