Adi srinivas vs Harishrao: బీఆర్ఎస్ కొత్త స్కెచ్ వేసింది.. ప్లాన్ ప్రకారమే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్నామ్యాయం అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. అందుకే ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేలా ప్రణాళికలు వేయడం, అందుకు తగ్గట్టుగానే వెళ్తోంది.
నిత్యం వార్తల్లో ఉండేలా చేసుకుంటోంది కారు పార్టీ. ఏదో విధంగా అధికార పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు గెలుస్తామంటూ మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
మాజీ మంత్రి హరీష్‌రావు భ్రమలు వీడాలని హితవు పలికారు ప్రభుత్వ విప్. పది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేసింది మరిచిపోయావా సూటిగా ప్రశ్నలు సంధించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నాకే పరిమితం కాలేదా అంటూ మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెడితే వంద సీట్లు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంపై విమర్శలు తప్పితే.. ఏం చేశారని అన్నారు.
ALSO READ: కేటీఆర్ తోనే..కేసీఆర్ చెక్?
బడ్జెట్ జరుగుతుంటే అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఎందుకు వెళ్లిపోయారు? అంటూ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు ఆది శ్రీనివాస్. మాట్లాడితే రేవంత్ కేబినెట్ విస్తరణపై విమర్శలు గుప్పించడాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల వరకు మంత్రివర్గం లేకుండా పాలన చేయలేదా? అంటూ గుర్తు చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని కుండబద్దలు కొట్టేశారు విప్ ఆది శ్రీనివాస్. గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ పాలన చూసి, ప్రజలు దూరం పెట్టారన్నారు. ఇక తెలంగాణలో అధికారంలోకి కారు పార్టీ రావడం కష్టమని చెప్పకనే చెప్పేశారు విప్ శ్రీనివాస్.
ఇప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని హరీష్ రావు కలలుకంటున్నాడు.
రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మీ బతుకు ఏమైందో మరిచిపోయావా?
డిపాజిట్లు కూడా లేకుండా చిత్తుగా ఓడించినా మీకు సిగ్గురావడం లేదా?
: ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్. pic.twitter.com/pe9rxL8Dwr
— Telangana Congress (@INCTelangana) October 30, 2024