Borugadda Anil warning: బోరుగడ్డ అనిల్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశాడు. ఈసారి ఏకంగా మూడు న్యూస్ ఛానెళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. వారిని నడిరోడ్డుకి ఈడుస్తానంటూ కాసింత గట్టిగా హెచ్చరించాడు. అసలేం జరిగిందంటే..
వైసీపీ ప్రభుత్వంలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు బోరుగడ్డ అనిల్. వైసీపీ ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కాస్త పాపులర్ అయ్యాడు.. అదే ఆయనకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్‌ని పోలీసులు అరెస్ట్, విచారణకు తీసుకోవడం జరిగిపోయింది. తన వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతలు ఎవరున్నారనేది కళ్లకు కట్టినట్టు చూపించాడు.
ఇదిలావుండగా రౌడీ షీటర్ అనబడే వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేశాడంటూ మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు మాజీ ఎంపీటీసీ గోర సురేష్. దీంతో బోరుగడ్డపై వివిధ సెక్షన్లు 504, 506, 509 కింద కేసు నమోదు అయ్యింది.
ALSO READ: 17 ఏళ్ల పిల్లాడి తల నరికివేత.. కుటుంబ కక్షలకు టీనేజర్ బలి!
ఈ కేసు నిమిత్తం అనిల్‌ను శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయనకు నవంబర్ ఐదు వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. శ్రీకాకుళం నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. శ్రీకాకుళం నుంచి బయలుదేరే ముందు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసింది మీడియా.
పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తనను, ఫ్యామిలీ గురించి అవాస్తవాలు ప్రచారం చేశారంటూ మూడు ఛానెళ్లపై మండిపడ్డాడు బోరుగడ్డ. మూడు తెలుగు ఛానెళ్లను జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబెడతానంటూ కాసింత గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వారిని నడిరోడ్డుకి ఈడుస్తానన్నది ఆయన మాట.
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేశాడంటూ ఈ ఏడాది మే 13న శ్రీకాకుళం జిల్లా గార పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీటీసీ గోర సురేష్
అనిల్‌పై ఐపీసీ సెక్షన్లు 504, 506, 509 క్రింద కేసు నమోదు
ఈ కేసు విషయమై అనిల్… pic.twitter.com/LoLYSvaq6s
— BIG TV Breaking News (@bigtvtelugu) October 30, 2024